-
అపోలోలో చేరిన ఈటల..
తన నియోజకవర్గం హుజురాబాద్‌లో పాదయాత్ర నిర్వహిస్తోన్న బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.. దీంతో పాదయాత్రను ఆయన తాత్కాలికంగా వాయిదా వేశారు.. ప్రజాదీవెన పేరుతో పాదయాత్రను ఈ నెల 19న కమలాపూర్ మండలం నుంచి ప్రారంభించిన ఆయన.. 12వ రోజు వీణవంక మండలంలోని కొండపాక గ్రామానికి చేరుకుంది. ఇక, ఈటల సాయంత్రం 4 గంటలకు భోజనం చేశారు.. అప్పటికే స్వల్ప దగ్గు, జ్వరంతో ఇబ్బంది పడ్డారు.. దీంతో వైద్య పరీక్షలు […] -
యాచారంలో టెన్షన్ టెన్షన్.. 33 కేవీ విద్యుత్ టవర్లు కూల్చివేత..!
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లిలో ఉద్రిక్త నెలకొంది… అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ టవర్లను కూల్చివేశారు స్థానికులు.. నిన్న పోలీస్ బందోబస్తు మధ్య 33 కేవీ విద్యుత్ టవర్లను ఏర్పాటు చేశారు అధికారులు.. అయితే, ఇవాళ పెద్ద ఎత్తున తరలివచ్చిన తక్కళ్లపల్లి గ్రామస్తులు, మహిళలు… ఆ టవర్లను కూల్చివేశారు.. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. కాగా.. కందుకూరు మండలం మీర్ఖాన్పేటలోని అమెజాన్ సంస్థ కోసం విద్యుత్ టవర్లు ఏర్పాటు చేశారు.. తక్కళ్లపల్లి పవర్‌ప్లాంట్ నుంచి అమెజాన్ […] -
కోమటిరెడ్డి బ్రదర్స్‌పై తిరుగుబాటు తప్పదు.. జగదీష్‌రెడ్డి వార్నింగ్..
కోమటిరెడ్డి బద్రర్స్‌పై మరోసారి ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని చూసి సొంత నియోజకవర్గ ప్రజలే చీదరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.. కోమటిరెడ్డి బ్రదర్స్.. ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారన్న ఆయన.. మీడియా ప్రచారం కోసమే వారి ఆర్భాట౦.. కానీ, ప్రజలకు సేవ చేయాలనే సోయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వారి ధ్యాస డబ్బు సంపాదన పైనే ఉంటుంది.. కానీ, పనులు చేయడంలో ఉండదన్న […] -
ఆగస్టు 16 నుంచి స్కూళ్లు ప్రారంభిస్తున్నాం..
ఆగస్టు 16వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం అవుతాయని.. తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. జగనన్న విద్యాదీవెనపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆగస్టు 16న రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని.. ఉపాధ్యాయులకు ఆగస్టు 16లోగా 100శాతం బూస్టర్ డోస్ తో పాటు పూర్తిచేయాలని సీఎం ఆదేశించినట్టు వెల్లడించారు. ఇక, విద్యాకానుక రెండవ సారి అన్ని స్కూళ్ళలో అందించేందుకు […] -
కేఆర్ఎంబీకి తెలంగాణ మరో లేఖ
కృష్ణా నది జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.. లేఖల పర్వం నడుస్తూనే ఉంది. తాజాగా కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాశారు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్.. 50 : 50 శాతంలో కృష్ణా నీటివాటా కేటాయించాలని కోరిన ఆయన.. ఏపీ ప్రభుత్వం కృష్ణా నీటిని బేసిన్ పరిధి దాటి మళ్లిస్తుందని కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, లేఖలోని కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే.. పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపునకు […] -
ముక్కు నేలకు రాసి ఈటల క్షమాపణలు చెప్పాలి..!
ఈటల రాజేందర్ బావమరిది దళితులపై చేసిన వ్యాఖ్యలకు.. ఈటల రాజేందర్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మోత్కుపల్లి నర్సింహులు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. 40 ఎకరాల అసైన్డ్ భూములు లాక్కున్న ఈటలకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు.. ఈటలను హుజురాబాద్‌లో ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చిన మోత్కుపల్లి.. ఈటల బావమరిది దళితులను బూతులు తిట్టడం సరికాదని.. ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న ఈటలను ప్రజలు నమ్మొద్దని కోరారు.. ఇక, ఈటల ఆక్రమించిన దళితుల భూముల్లో జెండాలు […] -
వైరల్: మీరు రాజీనామా చేస్తేనే అభివృద్ధి..! ఎమ్మెల్యేకు విజ్ఞప్తి..
ఎన్నికల్లో హామీలు ఇవ్వడం.. విజయం సాధించిన తర్వాత వాటిని అమలు చేస్తూ.. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం ఎమ్మెల్యేల పని.. ఎన్నికల్లో గెలిపిస్తే అభివృద్ధి చేస్తామంటూ నాయకులు చెప్పేవారు.. ఇప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందా? అనే చర్చ మొదలైంది.. దానికి ముఖ్య కారణం హుజురాబాద్ ఉప ఎన్నికలే అంటున్నారు.. తాజాగా, యాదాద్రి భువన గిరి జిల్లా ఆలేరు ప్రజలు.. తమ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు చేసిన విజ్ఞప్తి వైరల్‌గా మారిపోయింది.. గొంగిడి సునీతగారికి ఆలేరు […] -
కేరళలో మళ్లీ సంపూర్ణ లాక్డౌన్.. !
భారత్‌లో ఈశాన్య రాష్ట్రాలతో పాటు కేరళలో కరోనా వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉంది. మిగతా రాష్ట్రాల్లో రోజువారీగా వందల సంఖ్యలో కేసులు నమోదవుతుంటే కేరళలో నిత్యం 10 వేలకు పైగానే కేసులు బయటపడుతున్నాయి. కేరళలో కొవిడ్ పరిస్థితులు చేజారిపోయినట్లు కనిపిస్తున్నాయని ఆరోగ్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్ తీవ్రతకు వణికిపోయిన మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గింది. కేరళలో ఇంకా 10 శాతానికిపైగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న రోజువారీ […] -
బ్రిటన్‌లో మరో వైరస్ టెన్షన్
కరోనా వైరస్‌తో పాటు మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. నోరో పేరుతో పిలుస్తున్న ఈ వైరస్ ఐదు వారాలుగా బ్రిటన్‌లో అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. బ్రిటన్‌లో ఇప్పటి వరకూ ఈ వైరస్‌కు సంబంధించి 154 కేసులు గుర్తించారు. నోరో వైరస్ కేసులు పెరుగుతుండటంతో బ్రిటన్ ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నోరో వైరస్ బారినపడిన వారికి తల తిరగడం, వాంతులు రావడం లాంటి లక్షణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి […] -
లోక్‌సభ.. పోలవరంపై వైసీపీ వాయిదా తీర్మానం
లోకసభలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుపై వాయిదా తీర్మానం ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు వైసీపీ ఎంపీ చింతా అనురాధ… పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదముద్ర వేయాలని నోటీసులో పేర్కొన్నారు.. అయితే, బుధవారం రోజు కేంద్ర జల శక్తి శాఖ క్లియరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే కాగా.. ఆర్థిక శాఖ నుంచి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపే వరకు పట్టు వదలకుండా పోరాటం చేస్తామంటున్నారు వైసీపీ ఎంపీలు.. మరోవైపు.. ఏపీ […]
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!