కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.. ఫస్ట్ వేవ్ కంటే వేంగంగా విస్తరిస్తోంది మహమ్మారి.. క్రమంగా వైరస్ బారిన పడుతోన్న సాధారణ ప్రజలతో పాటు వీవీఐపీల సంఖ్య కూడా పెరిగిపోతోంది.. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు కోవిడ్ భారిన పడగా.. తాజాగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ కు కూడా కోవిడ్ సోకింది.. ఆయన వయస్సు 61 సంవత్సరాలు.. తనకు కరోనా వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా […]
ఓవైపు కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది.. మరోవైపు.. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.. ఏ రాష్ట్రంలోలేని విధంగా అక్కడ ఏకంగా ఎనిమిది విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ.. ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ ముగియగా.. మరో మూడు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఇక, ఎన్నికల ముందు నుంచీ అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది.. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో.. ప్రధాని మోడీని టార్గెట్ చేసి విమర్శలు […]
తెలంగాణకు మరో మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి.. ఇప్పటికే మూడు నాలుగు రోజుల నుంచి అక్కడక్కడ భారీ గాలులతో కూడా వర్షాలు కురుస్తుండగా.. ఇప్పుడు విదర్భ మరియు మరత్వాడ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కి మి నుండి 2.1 కిమి ఎత్తు మధ్య ఏర్పడిన ఉపరితల ద్రోణి ఈ రోజు బలహీన పడింది.. ఈ రోజు ఉత్తర- తూర్పు ఉపరితల ఆవర్తనం దక్షిణ తమళనాడు నుండి ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 […]
కరోనా సెకండ్ వేవ్ కలవర పెడుతోంది.. పాజిటివ్ కేసుల సంఖ్యే కాదు.. క్రమంగా మృతుల సంఖ్య కూడా పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది.. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా.. ఒకే కుటుంబంలో నలుగురు, ముగ్గురు, ఇద్దరు ఇలా ప్రాణాలు వదులుతున్నారు.. నిన్న జగిత్యాలలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందగా.. విజయవాడలో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు కన్నుమూశారు.. తాజాగా.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఇద్దరు దంపతులు కరోనాతో కన్నుమూశారు.. పూర్తి వివరాల్లోకి […]
భారత్‌తో కరోనా మహమ్మారి సేకండ్‌వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.. దీంతో.. కోవిడ్ కట్టడికి వివిధ రాష్ట్రాలు కఠిన చర్యలకు పూనుకుంటున్నాయి.. కేసుల తీవ్రతను బట్టి కొన్ని రాష్ట్రాలు పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తుంటే.. మరికొన్ని రాష్ట్రాలు.. నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు.. తాజాగా మరో రాష్ట్రం ఈ జాబితాలో చేరింది.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సైతం కరోనా కట్టడి కోసం కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఈ వారం నుంచి కరోనా మహమ్మారి ప్రభావం తగ్గేవరకు ప్రతి […]
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఓ కరపత్రం ఇప్పుడు కాకరేపుతోంది.. ఈ వ్యవహారంతో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదంలో చిక్కుకున్నట్టు అయ్యింది.. ప్రజాప్రతినిధులు డబ్బులు అడుగుతున్నారంటూ రిలీజ్ అయిన పాంప్లెట్ ఇప్పుడు వరంగల్ లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ కరపత్రాలు హల్చల్ చేస్తున్నాయి.. వివరాల్లోకి వెళ్తే.. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వడానికి ఎమ్మెల్యేలు.. రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారంటూ ఓ కరపత్రం […]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. వివేకా హత్య సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీవీ ఈ కేసు విచారణలో సీబీఐ అచేతనత్వంతో ఉందని.. సీబీఐ విచారణ మొదలై ఏడాది గడిచినా కేసు దర్యాప్తులో పురోగతి లేదని సీబీఐ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే కాగా.. వివేకా హత్యకేసు సమాచారం ఉందని సీబీఐకి రెండుసార్లు తెలిపానని.. అయినా స్పందించలేదని పేర్కొన్నారు.. […]
కరోనా బాధితుల చికిత్సలో ఆక్సిజన్ పాత్ర కీలకమైనది.. కరోనాబారిన పడి ఆస్పత్రి చేరాడంటేనే ఆక్సిజన్ తప్పనిసరి.. అయితే, వరుసగా కేసులు పెరగడం.. క్రమంగా ఆస్పత్రులకు తాకిడి పెరగడంతో.. ఆక్సిజన్‌కు కొరత ఏర్పడింది.. దీంతో.. ఆస్పత్రులు, అంబులెన్స్‌లు సైతం ఆక్సిజన్ ఏజెన్సీల దగ్గర క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.. విజయవాడలో గత నాలుగు రోజులుగా ఆక్సిజన్ కు భారీగా డిమాండ్ పెరిగిపోయింది.. మరో మూడు రోజుల్లో నగరంలో నిల్వ ఉన్న ఆక్సిజన్ మొత్తం అయిపోతుందని చెబుతున్నారు ఆక్సిజన్ సప్లేయర్స్.. […]
కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడంలేదు.. సామాన్యుల నుంచి వీఐపీల వరకు అంతా మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు.. తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కూడా కరోనా వైరస్ సోకింది.. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత కాస్త నలతగా ఉండడంతో.. వైద్యుల సూచనల మేరకు కోవిడ్ టెస్ట్‌లు చేయించుకున్నారు.. అయితే, […]