భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.. మరోవైపు మూడు వేవ్ ముప్పు పొంచిఉందని హెచ్చరిస్తూనే ఉన్నారు వైద్య నిపుణులు.. ఈ పరిస్థితుల్లో కోవిడ్‌ను ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటిఏ మార్గం.. కానీ, కరోనా వ్యాక్సిన్ల కొరత కారణంగా.. వ్యాక్సినేషన్ చాలా రాష్ట్రాల్లో నిలిచిపోయిన పరిస్థితి.. అయితే, వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న టార్గెట్‌తో ఉంది కేంద్రం.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్).. భారత్‌లో ఈ ఏడాది […]
తెలంగాణలో లాక్డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయబోతున్నారు.. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రాష్ట్ర సరిహద్దులను పూర్తిగా మూసివేయబోతున్నారు.. సరిహద్దు దాటి ఒక్కరు కూడా రాష్ట్రంలోకి రాకుండా.. బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించనున్నట్టు తెలిపారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి.. రాష్ట్రంలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకే గూడ్స్ వాహనాలకు అనుమతి ఇస్తారు. అయితే, పోలీసులు సీజ్ చేసిన వాహనాలు లాక్డౌన్ […]
కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసిన కరోనా మందు పంపిణీకి నిన్ననే బ్రేక్‌లు పడ్డాయి… మళ్లీ ఎప్పటి నుంచి ప్రారంభం అయ్యేదానిపై ఇంకా క్లారిటీ లేదు.. మందు పంపిణీ నిలిపివేసిన కారణంగా ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఆనందయ్యతో పాటు.. స్థానిక ఎమ్మెల్యే కూడా కోరారు.. ఆనందయ్య మందుపై తుది నివేదిక వచ్చిన తర్వాతే మందు తయారు చేయడం గానీ, పంపిణీ గానీ ఉండే అవకాశంఉంది. ఇప్పటికే ఆయూష్ బృందం కృష్ణపట్నంలో మకాం వేయగా.. ఇవాళ ఆయూష్ టీమ్ పర్యవేక్షణలో […]
అసలు కంటే.. కొసరు ఎక్కువట.. అసలు మందు ఇప్పటికే ఆపేశారు.. కానీ, ఇదే ఆ మందు అంటూ బ్లాక్ మార్కెట్లో సొమ్ము చేసుకోవడానికి బయల్దేరారు కేటుగాళ్లు.. విషయానికి వస్తే.. కరోనాకు ఆయుర్వేద మందుతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయారు కృష్ణపట్నం ఆనందయ్య.. ఇప్పుడు.. వార్తా కథనాలు మొత్తం ఆయన చుట్టే తిరుగుతున్నాయి.. మందులు ఏం వాడుతున్నారు దగ్గర నుంచి ఎలా తయారు చేశారు.. పంపిణీపై చర్చ సాగుతోంది.. ఇక, దీనిపై పూర్తిస్థాయిలో తేల్చేందుకు ఆయూష్ డిపార్ట్మెంట్కు కూడా రంగంలోకి […]
కరోనా సెకండ్ వేవ్ సామాన్యుల ప్రాణాలే కాదు.. పెద్ద సంఖ్యలో వైద్యుల ప్రాణాలు కూడా తీస్తోంది… కనిపించని వైరస్‌తో ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సులు పెద్దల సంఖ్యలో దాని బారినపడుతూనే ఉన్నారు.. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయిన తర్వాత దేశవ్యాప్తంగా 420 మంది వైద్యులు మరణించారని ప్రకటించింది ఇండియన్ మెడికల్ అసోసియేష (ఐఎంఏ).. అందులో కేవలం ఢిల్లీలోనే 100 మంది వైద్యులు మృతిచెందారని.. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్‌లోనే వైద్యులు […]
కరోనా కట్టడిలోనై తన మార్క్ చూపిస్తున్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. మాస్క్ ధరించడంపై స్వయంగా ఓ వీడియోను రూపొందించి విడుదల చేశారు.. ఇక, కోవిడ్ కట్టడిలో తామున్నామంటూ ప్రభుత్వానికి సహాయం చేస్తున్నారు సినీ తారలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు.. తాజాగా, కోవై జిల్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు పలు సంస్థలు, పారిశ్రామికవేత్తలు ఏకుంగా రూ.32 కోట్ల విరాళాలు అందజేశారు. ఈ మేరకు తమిళనాడు సచివాలయం ప్రకటన విడుదల చేసింది.. పరిశ్రమల నగరం కోయంబత్తూర్ జిల్లాలో […]
కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. భారత్‌లో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయంటూ ప్రచారం జరిగింది.. ముఖ్యంగా.. కరోనా బీ.1.617 వేరియంట్‌ను భారత్ వేరియంట్‌గా పలు కథనాలు వచ్చాయి.. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా సంస్థలను కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.. డబ్ల్యూహెచ్‌వో తమకు సంబంధించిన ఏ నివేదికలోనూ భారత్ వేరియంట్ అనే పదాన్ని వాడలేదని, ఇది పూర్తిగా తప్పుడు సమాచారమంటూ ఆయా సంస్థలకు కేంద్ర ఐటీ శాఖ లేఖ రాసింది. ఇక, […]
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తూనే ఉంది.. 2.5 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. 4 వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి.. ఈ తరుణంలో.. భారత నుంచి విమానాల రాకపోకలపై విధించిన బ్యాన్‌ను పొడిగించింది కెనడా ప్రభుత్వం.. జూన్ 21వ తేదీ వరకు బ్యాన్ కొనసాగుతోందని స్పష్టం చేసింది.. కాగా, కోవిడ్ నేపథ్యంలో ఏప్రిల్ 22న భారత్‌తో పాటు పాకిస్థాన్ విమానాలపై బ్యాన్ విధించింది కెనడా.. ఈ రెండు దేశాల నుంచి వచ్చే […]
ఎంపీ రఘురామరాజుకు ఆనారోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వాస్తవానికి మిశ్రమంగానే వుంది. బెయిల్ సమయంలో పత్రికకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని మీడియాతో మాట్లాడరాదని ఆంక్షలు పెట్టడమే గాక సిఐడి పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాని కోర్టు ఆదేశించింది. ఆయన ఆరోగ్యం సరిగా లేదు గనక సిఐడి కస్టడీలో వుంచి విచారణ జరపాల్సినంత అవసరం లేదంటూ ఇప్పటికే వారు వీడియోతో సహా సాక్ష్యాధారాలు సేకరించుకున్న సంగతి గుర్తు చేసింది. స్వయానా సిఐడి […]