నరసరావుపేటలో ఓ యువతి కడుపులో నుంచి పెన్నులు బయటకు తీశారు వైద్యులు.. నరసరావుపేటకి చెందిన 28 ఏళ్ల యువతి కడుపులో ఉన్న నాలుగు పెన్నులను వైద్యుడు రామచంద్రారెడ్డి శస్త్ర చికిత్స చేసి వెలికి తీశారు. వాంతులతో ఆస్పత్రికి చేరిన యువతకి.. అనుమాతంలో సిటీ స్కాన్ చేశారు వైద్యులు.. దీంతో, కడుపులో పెన్నులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
తీగ లాగితె డొంకంతా కదిలినట్టు.. ఇప్పుడు డ్రగ్స్ కేసులో తీగ లాగితే డ్రగ్స్ దందా మొత్తం బయటకు వస్తుంది.. విశాఖపట్నం డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ల సంఖ్య పెరిగిపోతోంది.. ఈ కేసులో దూకుడు పెంచిన పోలీసులు.. తాజాగా ఓ డాక్టర్ ను అరెస్ట్ చేశారు.. డాక్టర్ కృష్ణ చైతన్య వర్మను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు..
వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు అనుమతి ఇచ్చారు పోలీసులు.. 9వ తేదీన బంగారుపాళ్యం పర్యటనకు అనుమతి ఇచ్చారు చిత్తూరు జిల్లా పోలీసులు... అయితే, అనుమతి ఇస్తూనే.. కొన్ని షరతులు పెట్టారు.. 9వ తేదీన బంగారుపాళ్యం పర్యటనకు జగన్ వెళ్లనుండగా.. బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ చిన్నది కావడంతో ఐదువందల మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు పోలీసులు..
తోతాపురి మామిడి రైతుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఇప్పటి వరకూ 3,08,261 మెట్రిక్ టన్నుల మేర తోతాపురి మామిడిని ట్రేడర్లు, ప్రాసెసింగ్ యూనిట్లు రైతుల నుంచి కొనుగోలు చేశాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రాసెసింగ్ యూనిట్లు, పల్ప్ పరిశ్రమలు తమ సామర్ధ్యం మేరకు మామిడిని కొనుగోలు చేస్తున్నాయి.
ఏపీలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.. మాకు రావాల్సినవి ఇవ్వకపోతే ఉద్యమిస్తాం అంటూ అల్టిమేటం ఇస్తున్నాయి... ఒకటో తేదీనే జీతం ఇస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూనే, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు అసంతృప్తి ప్రకటిస్తున్నారు.. ఏపీజేఏసీ నాయకులు.. ఉద్యోగ, ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వ జగన్నాథ రథచక్రాలు పని చేయడం లేదని, సంవత్సర కాలం ఎదురుచూసాం.. ప్రభుత్వ జగన్నాథ రథచక్రాలు ఉద్యోగుల వైపు చూడాలి అంటూ మనసులో మాటను బయటపెట్టారు..
చికెన్ పకోడీ వివాదం ఒక వ్యక్తిని హత్య చేసేదాకా వచ్చింది. మద్యం మత్తు నిండు ప్రాణాన్ని బలి చేసింది. మరొకరిని హంతకుడిగా మార్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వసపలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన మిన్నారావు అనే యువకుడు శనివారం రాత్రి పూటుగా మద్యం సేవించాడు. మద్యం మత్తులో సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వెళ్లాడు. చికెన్ పకోడీ కావాలని అడిగాడు. అయితే, షాపు యజమాని లేదని చెప్పాడు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన సొంత జిల్లా.. కడప జిల్లాలో పర్యటించబోతున్నారు.. నేటి నుంచి రెండు రోజులు కడప జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగనుంది.. రేపు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు జగన్..