సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటే నమ్మి చెన్నై వచ్చిన 14 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన కేసులో మలయాళ సినీనటి మిను మునీర్‌ను పోలీసులు అరెస్టుచే శారు. పోలీసుల కథనం.. పదేళ్ల క్రితం మిను మునీర్.. సినిమాల్లో నటించేలా చేస్తానని చెప్పి తన బంధువు కుమార్తె అయిన 14 ఏళ్ల బాలికను చెన్నై తీసుకొచ్చి ఓ ప్రైవేటు హోటల్లో ఉంచింది. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్రెడ్డికి మిగిలింది ఇక విలీనమే అన్నారు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు పోవడమే కాకుండా ఇప్పుడు సొంత మండలం కూడా పోయిందన్న ఆయన.. భారతీయ జనతా పార్టీ దగ్గరకు వెళ్ళలేడు కాబట్టి.. ఆయన మాతృ పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తాడేమో...? ఆయనకు మిగిలింది అదొక్కటే అని పేర్కొన్నారు
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయంపై మంత్రులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. జిల్లాలో అందరూ ఈ విజయం పట్ల రియాక్ట్ కావాలని సూచించారు.. పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి.. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి 11 మంది నామినేషన్లు వేశారనే విషయాన్ని గుర్తుచేశారు సీఎం చంద్రబాబు నాయుడు..
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక లలో టీడీపీ విజయంపై స్పందించారు.. పులివెందులలో జరిగిన ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరిగాయి.. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని తెలిపారు బాలయ్య.. ఇక్కడ జరిగిన ఎన్నికలతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా అక్కడి ప్రజలకు స్వాతంత్య్రం వచ్చింది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇక, ఈ ఎన్నికల్లో 11 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నామినేషన్లు కూడా వేశారు.. ప్రజలు ధైర్యంగా వచ్చి ఓట్లు వేశారు.. అంటే.. అక్కడ స్వాతంత్య్రం వచ్చినట్టే అని పేర్కొన్నారు సినీ…
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌పై స్టే విధించాలని కోరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు దాఖలు చేసిన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ పూర్తి అయ్యింది.. పోలింగ్ చట్ట విరుద్ధంగా అప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్లు.. ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన చేసి పోలింగ్ ను అధికార పార్టీ నాయకులు చేయించారని కోర్టుకు తెలిపారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అసెంబ్లీకి వస్తారా..? రారా? క్లారిటీ ఇవ్వండి.. మీ మూలంగా ప్రశ్నలు మురిగిపోతున్నాయని మండిపడ్డారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి.. ముందు ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని నిలదీశారు.. ప్రజాస్వామ్య దేవాలయంకు ఆయన ఇచ్చే గౌరవం ఇదేనా? ఆ సభ్యులు ఇచ్చే గౌరవం ఇంతేనా? అంటూ ఫైర్ అయ్యారు..