తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేద్దామా? వద్దా..? అనే విషయంపై కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడుతోంది… లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ విషయంపై ఇవాళ పీఏసీ సమావేశమై చర్చింది.. అయితే, పోటీపై ఎలాంటి నిర్ణయానికి రానట్టుగా తెలుస్తోంది.. ఇక, నల్గొండలో పోటీ చేయాలా..? వద్దా..? అనేది జిల్లా నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం అని ఈ సమావేశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి తెలిపినట్టుగా సమాచారం.. మరోవైపు.. […]
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగుతోంది.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న బండి సంజయ్‌ను అడుగడునా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి టీఆర్ఎస్ శ్రేణులు.. దీంతో.. పలు చోట్ల టీఆర్ఎస్-బీజేపీ నేతల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి.. ఇక, వారిని చెదరగొట్టేందుకు లాఠీలకు పోలీసులు పనిచెప్పాల్సి వచ్చింది. Read Also: విశాఖ టు మధ్యప్రదేశ్.. అమెజాన్ ద్వారా గంజాయి..! తాజాగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల చిల్లేపల్లిలో బండి సంజయ్ […]
గంజాయి వ్యవహారంపై గత కొంతకాలంగా ఏపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతూనే ఉంది.. ఈ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు… పలు ప్రాంతాల్లో గంజాయి పట్టుబట్టడం.. అవి ఏపీకి లింక్‌లు ఉన్నాయనే వార్తలతో ప్రత్యేకంగా గంజాయి నివారణ చర్యలను చేపట్టింది ఏపీ ప్రభుత్వం.. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం కె. నారాయణ స్వామి.. ఆపరేషన్ పరివర్తన్‌లో భాగంగా ఎస్ఈబీ, పోలీసు శాఖ కలిసి ఇప్పటి వరకు 2,228 ఎకరాల్లో గంజాయి పంటను […]
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం అయ్యారు రాష్ట్ర బీజేపీ నేతలు.. అయితే, ఈ సమావేశంలో ఏపీ నేతలకు అమిత్‌షా పెద్ద క్లాసే తీసుకున్నారట.. ఏపీ కో-ఇంచార్జ్ సునీల్ దేవధర్, ఎంపీ జీవీఎల్‌కి ప్రత్యేకంగా ఆయన క్లాస్ పీకినట్టు సమాచారం.. వైసీపీయే మన ప్రధాన శత్రువు… ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సూచించిన ఆయన.. అమరావతే ఏపీ రాజధాని అన్నది బీజేపీ స్టాండ్.. రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలపాలని సూచించారు.. జనసేనా […]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతూనే ఉంది… కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు పోటీపడి లేఖలు రాస్తూ వస్తున్నాయి రెండు రాష్ట్రాలు.. తాజాగా, కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. కేఆర్ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ఈ సారి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు విషయాన్ని కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు.. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుపై ఫిర్యాదు చేసిన తెలంగాణ […]
గంజాయి, డ్రగ్స్ విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. వాటి సరఫరాకు ఉన్న ఏ అవకాశాన్ని వదలడం లేదు కేటు గాళ్లు.. లారీలు, కార్లు, ఆటోలు, టూ విలర్, చివరకు విమానాల్లో కూడా మత్తు పదార్థాలు పెద్ద ఎత్తున పట్టుబడుతూనే ఉన్నాయి.. కేజీలు, క్విటాళ్ల కొద్ది గంజాయి దొరికిన సందర్భాలు లేకపోలేదు. అయితే, స్మగ్లర్లు రూట్ మార్చారు.. ఆధునిక యుగంలో అంతా ఆన్లైన్ అయిపోయింది.. ఏ వస్తువు కావాలన్నా ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫారమ్స్ను ఆశ్రయిస్తున్నారు వినియోగదారులు. ఇప్పుడు గంజాయి విక్రయాలు […]
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం లక్ష్యంగా కొత్త పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. వివిధ సమస్యలపై పోరాటం చేస్తూ వస్తున్నారు.. పాదయాత్ర, దీక్షలు, ధర్నాలు.. ఇలా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక, నిరుద్యోగ సమస్యను పోరాట ఆయుధంగా తీసుకున్న వైఎస్ షర్మిల.. ప్రతీ మంగళవారం ఒక ప్రాంతాన్ని ఎంచుకుని నిరుద్యోగ దీక్షలు చేస్తున్నారు.. ఉన్నత చదువులు చదవి ఉద్యోగం దొరకక ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాలను పరామర్శించడం.. ఆ తర్వాత ఒక్కరోజు దీక్ష చేసి.. […]
ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు బిర్యా ముండా జయంతి సందర్భంగా.. ఆయన జన్మస్థలానికి వెళ్లిన కేంద్ర మంత్రలు అర్జున్ ముండా, జి. కిషన్ రెడ్డి.. బిర్సా ముండా అనుచరులను సన్మానించారు.. ఝార్ఖండ్‌లోని బిర్సా ముండా జన్మస్థలం ఖుంటి జిల్లాలోని ఉలిహటు గ్రామంలో ఈరోజు ఆయన జయంతి వేడుకలు నిర్వమించారు.. ఈ సందర్భంగా ఆయన అనుచరుల పాదాలను కడిగి.. సన్మానించారు అర్జున్ ముండా, జి కిషన్ రెడ్డి.. కాగా, 1875లో జన్మించిన బిర్సా ముండా.. 1900లో కన్నుమూశారు.. అటవీ జాతుల […]