Hyderabad Couple Caught Smuggling Ganja: డబ్బుకు లోకం దాసోహం అంటారు. అలాంటి డబ్బు ఎలాంటి పనులు అయినా చేయిస్తుంది. ఉద్యోగం పోయిన ఇద్దరు దంపతుల్ని గంజాయి పెడ్లర్లుగా మార్చింది. అటు గంజాయి కోసం కొంత మందిని కిడ్నాపర్లుగా మార్చింది. మొత్తంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ రెండు ఘటనలు పోలీసులకు సవాల్‌గా మారాయి. READ MORE: Shocking : కేపీహెచ్బీలో ఘోరం.. వేశ్యకు విటుడికి మధ్య ఘర్షణ.. కత్తితో దాడి హైదరాబాద్‌లో ఇద్దరు భార్యా భర్తలు గంజాయి […]
Modi Wang Yi meeting: భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. భారత్, చైనా మధ్య సంబంధాలు స్థిరమైన పురోగతిని సాధించాయని తెలిపారు. ఈసందర్భంగా ప్రధాని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. “వాంగ్ యీని కలవడం ఆనందంగా ఉంది. గతేడాది కజాన్‌లో జిన్‌పింగ్‌తో సమావేశమైనప్పటి నుంచి.. ఇరుదేశాల సంబంధాలు స్థిరమైన పురోగతిని సాధించాయి. సున్నిత అంశాలను గౌరవించడం, […]
NDA vs INDIA bloc: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు కానున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈక్రమంలో సోమవారం ఎన్డీఏ కూటమి తరుఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోటీ ఉంటుందా, ఉండదా అనే సందేహాలకు చెక్ పెడుతూ మంగళవారం ఇండియా అలయన్స్ తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించింది. దీంతో ఇద్దరు బలమైన ప్రొఫైల్ కలిగిన అభ్యర్థుల […]
Ukraine map change: వాషింగ్టన్లో మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అలాగే ఏడుగురు యూరోపియన్ నాయకుల మధ్య జరిగిన ముఖ్యమైన సమావేశం ముగిసిన విషయం తెలిసిందే. ఈ సమావేశం గత మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ముగియవచ్చనే ఆశను కలిగించింది. ఈ సమావేశంతో యుద్ధం ముగిసిపోతుందని అనిపిస్తున్నా, దాని కోసం ఉక్రెయిన్ భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందేమోనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధ సమయంలో పుతిన్ దళాలు స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ […]
wife kills husband: కలకాలం ఒకరికి ఒకరు తోడునీడగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి, తీరా జీవితాంతం తోడుగా నిలిచే భాగస్వాములను క్షణాల్లో ఖతం చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కోవకు చెందినదే ఈ వార్త కూడా. కానీ ఇక్కడ ఓ సంచలన విషయం ఏంటంటే.. తన భర్తను చంపడానికి ఓ భార్య గూగుల్‌ను ప్లాన్ అడగటం. తన భర్తను హత్య చేసిన తర్వాత తప్పించుకునే మార్గాలను ఆమె గూగుల్, సోషల్ మీడియాలో వెతికినట్లు […]
killed 52 civilians in Congo: ఆఫ్రికా దేశమైన కాంగోలో తిరుగుబాటుదారులు పౌరులపై ఊచకోతకు దిగారు. ఈసందర్భంగా స్థానిక అధికారులు మాట్లాడుతూ.. ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు కత్తులు, గొడ్డళ్లతో 52 మందిని నరికి చంపేశారని తెలిపారు. కాంగో దళాల చేతిలో ఓటమి పాలవడంతో రగిలిపోయిన అలైట్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఏడీఎఫ్) సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. బెని, లుబెరో ప్రాంతాల్లో ఏడీఎఫ్ తిరుగుబాటుదారులు పౌరులపై దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. READ MORE: Mirai […]
Kota Greenfield Airport: రాజస్థాన్‌లోని కోటా-బుండిలో రూ.1,507 కోట్ల పెట్టుబడితో కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత విమానాశ్రయంలో చిన్న విమానాలు మాత్రమే ల్యాండ్ అవుతున్నాయని, భవిష్యత్తులో కోటాలో A-321 రకం విమానాలు ల్యాండ్ అయ్యేలా కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దాని కోసం […]
Deadly Virus Outbreak in Gaza: గాజా-ఇజ్రాయెల్ యుద్ధంలో పెద్ద ఎత్తున మానవీయ సంక్షోభం ఏర్పడింది. అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. గాజాలో ప్రజలు ఆకలితో చనిపోతున్నారని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చినప్పుడల్లా, ఆయన దానిని పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ రోజురోజుకు గాజా వాస్తవికత చాలా భయంకరమైనదిగా మారుతోంది. ఇక్కడి ప్రజలు పోషకాహార లోపం కారణంగా తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రస్తుతం గాజాలో […]
Naveen Patnaik Hospitalized: బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా ప్రతిపక్ష నాయకుడు 78 ఏళ్ల నవీన్ పట్నాయక్ అనారోగ్యంతో బాధపడుతూ భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వయసు రీత్యా వచ్చిన సమస్యలతో ఆయన చికిత్స పొందుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. నవీన్ పట్నాయక్ ఆరోగ్యం గురించి పార్టీ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది. డీహైడ్రేషన్ కారణంగా ఆయన భువనేశ్వర్‌లోని ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, […]
India Finds Estimated 20 Tonnes of Gold: భారత్‌కు బంగారు నిధి దొరికింది. మీరు చదువుతున్నది నిజమే.. ఈ నిధి ఒడిశా రాష్ట్రంలో దాగి ఉంది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) సర్వేలో ఈ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో దాదాపు 20 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లు అంచనా వేసింది. విషయం బయటికి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, మైనింగ్ శాఖ వెంటనే చర్యలు చేపట్టాయి. అసలు ఎక్కడెక్కడ బంగారు నిల్వలు ఉన్నాయి, ఎంతెంత […]