మగువలకు శుభవార్త. పండగలు, వివాహాది శుభకార్యాల నేపథ్యంలో ఇటీవల వరుసగా దూసుకెళ్లిన బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండు రోజులు తగ్గి, మరో రెండు రోజులు స్థిరంగా ఉన్న పసిడి రేట్స్.. నేడు కాస్త దిగొచ్ఛాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (నవంబర్ 5) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.150 తగ్గి.. రూ.73,550గా నమోదైంది. 24 క్యారెట్లపై రూ.160 తగ్గి.. రూ.80,240గా ఉంది.
మరోవైపు బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పయనిస్తున్నాయి. ఇటీవల కిలో వెండి లక్షను దాటగా.. ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది. బులియన్ మార్కెట్‌లో నేడు కిలో వెండిపై రూ.1000 తగ్గి.. రూ.96,000గా నమోదయింది. నవంబర్ 1న మూడు వేలు తగ్గగా.. ఆపై మూడు రోజులు స్థిరంగా ఉన్నాయి. ఇక నవంబర్ 5న తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరల గురించి తెలుసుకుందాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.73,550
విజయవాడ – రూ.73,550
ఢిల్లీ – రూ.73,700
చెన్నై – రూ.73,550
బెంగళూరు – రూ.73,550
ముంబై – రూ.73,550
కోల్‌కతా – రూ.73,550
కేరళ – రూ.73,550
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.80,240
విజయవాడ – రూ.80,240
ఢిల్లీ – రూ.80,390
చెన్నై – రూ.80,240
బెంగళూరు – రూ.80,240
ముంబై – రూ.80,240
కోల్‌కతా – రూ.80,240
కేరళ – రూ.80,240
Also Read: Asus Rog Phone 9: ‘ఆసుస్’ నుంచి పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ అదుర్స్, ధర బెదుర్స్!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,05,000
విజయవాడ – రూ.1,05,000
ఢిల్లీ – రూ.96,000
ముంబై – రూ.96,000
చెన్నై – రూ.1,05,000
కోల్‌కతా – రూ.96,000
బెంగళూరు – రూ.96,000
కేరళ – రూ.1,05,000