ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి (నవంబర్ 11) నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. నాలుగు నెలల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం.. మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ నవంబర్ చివరితో ముగియనుండడంతో.. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష వైసీపీ హాజరుకావటం లేదు. కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలే […]
కూటమి ప్రభుత్వంలో చేనేతలను అన్ని విధాల ఆదుకుంటామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వీవర్స్ శాల ఏర్పాటు చేసి చేనేత కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. చేనేత మహిళలకు పెద్ద ఎత్తున ఆధునిక రాట్నాలను పంపిణీ చేశామని తెలిపారు. పీఐడబ్ల్యూఏ చేపడుతున్న కార్యక్రమాలు, నూతన పద్మశాలీ భవన్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం అందరితో కలిసి ఆయన ఫోటోలు దిగారు. మంగళగిరి-విజయవాడ […]
రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి అధికారంతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ నేటి యువతకు రోల్ మోడల్‌గా నిలిచారు రాష్ట్ర విద్య, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్. సమస్య ఎంత పెద్దదైనా, ఎంత జఠిలమైనదైనా తన దృష్టికి వచ్చిన వెనువెంటనే స్పందించడం, పరిష్కారమయ్యే వరకు వెంటపడడటం.. ప్రజాసేవలో మంత్రి లోకేష్ నిబద్ధత, చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. చాలీచాలని ఆదాయాలతో బతుకు భారంగా మారిన కొందరు సగటు జీవులు కష్టాల కడలి నుంచి గట్టేందుకు ఎడారి దేశాలకు వెళ్లి […]
కోటి దీపోత్సవం రెండో రోజు కార్యక్రమాలు ఇవే: కోటి దీపోత్సవం 2024లో నేడు రెండో రోజు. శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ (శ్రీ సిద్ధేశ్వరీ పీఠం, కుర్తాళం), రమ్యానంద భారతి మాతాజీ (శ్రీ శక్తిపీఠం, తిరుపతి) గారిచే అనుగ్రహ భాషణం ఉంటుంది. శ్రీ నండూరి శ్రీనివాస్ గారు ప్రవచనామృతం చేయనున్నారు. వేదికపై నర్మదా బాణలింగానికి కోటి భస్మార్చన, భక్తులచే స్వయంగా శివలింగాలకు కోటి భస్మార్చన, కోటి దీపోత్సవం వేదికపై వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కల్యాణం ఉంటుంది. […]
రచన టెలివిజన్ లిమిటెడ్ ప్రతీ ఏడాది హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా అంగరంగ వైభవంగా ‘కోటి దీపోత్సవం’ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో జరిగే దీపాల పండగలో లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి దీపాలను వెలిగిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 9 నుంచి 25 వరకు కోటి దీపోత్సవం జరగనుంది. కోటి దీపోత్సవం 2024 మొదటి రోజు శనివారం శంఖారావంతో ప్రారంభమైంది. వేలాది మందితో ఎన్టీఆర్ స్టేడియం కళకళలాడింది. […]
భారత్‌తో సొంతగడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా సిద్ధమవుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా తొలి టెస్టు పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. ఐదు మ్యాచుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టుకు మాత్రమే క్రికెట్ ఆస్ట్రేలియా తన జట్టును ప్రకటించింది. 13 మందితో కూడిన జట్టును శనివారం వెల్లడించింది. ఆసీస్ జట్టులోకి ఓ కొత్త ప్లేయర్ వచ్చాడు. భారత్-ఏతో అనధికారిక టెస్టుల్లో ఆస్ట్రేలియా-ఏకు సారథ్యం వహించిన నాథన్ మెక్‌స్వీనేకు అవకాశం దక్కింది. […]
నేడు గుంటూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పవన్ గుంటూరు చేరుకోనున్నారు. నగరం పాలెంలోని అరణ్య భవన్లో అటవీ అమరవీరుల సంస్మరణ సభలో డిప్యూటీ సీఎం పాల్గొననున్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు రాజమహేంద్రవరం జేఎన్ రోడ్ నందు APMSA స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాత్రి వరకు పలు కార్యక్రమాలలో మంత్రి కందుల […]
ఇటీవలి కాలంలో సొంతగడ్డపై భారత్ రెండు టెస్టు సిరీస్‌లను ఆడింది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులను, న్యూజిలాండ్‌తో మూడు టెస్టులను ఆడింది. బంగ్లాదేశ్‌పై 2-0 తేడాతో సిరీస్ గెలిచిన టీమిండియా.. న్యూజిలాండ్‌పై మాత్రం ఘోర పరాజయంను చవిచూసింది. ఈ ఐదు టెస్టులు జరిగిన పిచ్ రిపోర్ట్‌లను తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. ఇందులో ఒక్క పిచ్‌కు మాత్రమే మంచి రేటింగ్ వచ్చిందట. మిగతా నాలుగు పిచ్‌లు మాత్రం పాస్ అయినట్లు తెలుస్తోంది. Also Read: Venu […]
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి భారీ షాక్ తగిలింది. టాలీవుడ్ నటులు నాగ చైతన్య, శోభిత ధూళిపాళల వైవాహిక జీవితం మీద కామెంట్స్ చేసిన కేసు విషయంలో మహిళా కమిషన్ ఆయనకు రెండోసారి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 14వ తేదీన కమిషన్ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో ఈ కేసు విషయంలోనే నోటీసులు పంపగా.. వేణు స్వామి విచారణకు హాజరు కాలేదు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ.. వేణుస్వామి తెలుగు రాష్ట్రాల్లో చాలా […]
కోలీవుడ్ స్టార్ హీరో ‘దళపతి’ విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించారు. అక్టోబరు 27న విక్రవండిలో మొదటి బహిరంగ సభ నిర్వహించగా.. పది లక్షల మందికియా పైగా హాజరయ్యారు. అభిమానుల సందడి అయితే మరో లెవల్లో ఉంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి టీవీకే పోటీ చేస్తుందని బహిరంగ సభలో విజయ్ ప్రకటించారు. విజయ్ పొలిటికల్ […]