ఏపీని వర్షాలు వీడటం లేదు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 2 రోజుల్లో ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి కోనసీమ, ఎన్టీఆర్ తూర్పు, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అయితే.. అల్పపీడనం ప్రభావం వల్ల […]
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ ఆరోపించింది. తనను బెదిరించి 3 సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళ వెల్లడించింది. ఇద్దరం కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నామని, పార్టీ కార్యక్రమాల్లో పరిచయమై నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడని బాధిత మహిళ పేర్కొంది. ఎమ్మెల్యే ఆదిమూలం నాకు పదేపదే ఫోన్ చేసేవాడని, లైంగిక కోరిక తీర్చకుంటే కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించాడని బాధితురాలు తెలిపింది. ఆదిమూలం గురించి అందరికీ తెలియాలని […]
భారీ వర్షం.. ఉధృతంగా గాలి వీస్తున్నా.. బుడమేరు గండ్ల పూడిక పనుల్లో నిమ్మల రామానాయుడు అర్ధరాత్రి భారీ వర్షం, ఉధృతంగా గాలి వీస్తున్నా నిద్రాహారాలు సైతం మాని బుడమేరు గండ్ల పూడిక పనుల్లో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిమగ్నమయ్యారు. పనులకు ఎక్కడ ఆటంకం కలగకుండా అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజాము వరకు జోరున వానలోనే తడుస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజాము వరకు ఏకధాటిగా కురుస్తున్న వర్షంలో సైతం […]
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్ రిపేర్ పనులు ఊపందుకున్నాయి. బోట్లు గుద్దుకోవడం వల్ల ప్రకాశం బ్యారేజీ గేట్ -.69 డామేజ్ అయ్యింది. ధ్వంసమైన కౌంటర్ వెయిట్ స్థానంలో వేరే కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేయనున్నారు అధికారులు. విరిగిన కౌంటర్ వెయిట్ బండ్ ని వెల్డింగ్ చేసి తొలగించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. విరిగిన కౌంటర్ వెయిట్ బండ్‌ను తప్పించేందుకు క్రేన్ సిద్ధం చేశారు అధికారులు. నిపుణులు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. మరమ్మతు పనులు బెకెమ్ […]
టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆయన్ను ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరికి తరలిస్తున్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసిన ఒక రోజు తర్వాత ఈ అరెస్టు జరిగింది. పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతించాలన్న తన ఆదేశాలను కొనసాగించేందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. అయితే.. హైదరాబాద్ మియాపూర్‌లో నందిగం […]
విజయవాడ వరద ప్రాంతాల్లో శానిటేషన్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యవేక్షించారు. చీపురు చేత పట్టి పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు నారాయణ. నిర్దేశించిన ప్రాంతాల్లో శానిటేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. ఇళ్లను శుభ్రం చేసి యజమానులకు అప్పగించాలని ఆదేశించారు మంత్రి నారాయణ. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. విజయవాడలో గతంలో ఎప్పుడూ లేనంత వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, వరద ప్రాంతాల్లో మొదటి రోజు ప్రజలను రక్షించేందుకు […]
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. ‘ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మనమంతా సెప్టెంబర్ 5న గురు పూజా దినోత్సవం జరుపుకుంటూ ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తుంటాము. పిల్లల బంగారు భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఉపాధ్యాయులకే ఉంటుంది. అందుకే వారిని […]
అర్ధరాత్రి భారీ వర్షం, ఉధృతంగా గాలి వీస్తున్నా నిద్రాహారాలు సైతం మాని బుడమేరు గండ్ల పూడిక పనుల్లో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిమగ్నమయ్యారు. పనులకు ఎక్కడ ఆటంకం కలగకుండా అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజాము వరకు జోరున వానలోనే తడుస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజాము వరకు ఏకధాటిగా కురుస్తున్న వర్షంలో సైతం గట్టుపైనే గడిపారు మంత్రి రామానాయుడు. గండ్లు పూడిక జరిగితే గాని సింగ్ నగర్‌కు వరద […]
విజయవాడలో మళ్లీ వర్షం మొదలైంది. ఇప్పటికే బుడమేరు వరద ముంపుతో విజయవాడలోని పలు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. బుడమేరు వరద ముంపు మెల్లగా తొలగిపోతుండటంతో ఇప్పుడిప్పుడే సహాయక చర్యలు ఊపందుకున్నాయి. ఇంకా జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, అంబాపురం, సింగ్ నగర్లో ఇంకా వరద నీరు నిలిచి ఉంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. అయితే వర్షం కురుస్తున్నప్పటికీ వరద బాతులకు సహాయ కార్యక్రమాల్లో ఇటువంటి ఆటంకాలు ఉండకూడదని, వారికి అవసరమైన […]
ఒక్క నిమిషం కూడా కరెంట్ సరఫరాకు అంతరాయం ఉండొద్దు.. ఒక్క నిమిషం కూడా కరెంట్ సరఫరాకు అంతరాయం ఉండొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖపై సమీక్షలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణ ఒక బిజినెస్ హబ్ గా మారబోతోందన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఐటీ, ఇండస్ట్రియల్ శాఖలతో సమన్వయం చేసుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. సోలార్ […]