AP Registration Charges : ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 1 నుంచి భూముల మార్కెట్ ధరలను పెంచే నిర్ణయంపై వెనకడుగు వేసింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమవడంతో, ఈ నిర్ణయంపై పునరాలోచన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2025 జనవరి 1 నుండి భూముల మార్కెట్ ధరలను పెంచే యోచన తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ నిర్ణయంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి, అవసరమైన మార్పులు తీసుకోవాలని […]
కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ.. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం విచారించనుంది. తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ ఈ నెల 21న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తొలుత ఈ కేసును విచారించిన జస్టిస్ శ్రవణ్ కుమార్ ధర్మాసనం.. ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని, అయితే విచారణ కొనసాగించవచ్చని ఆదేశించింది. కౌంటర్ […]
Dola Veeranjaneyulu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన పాపాలు రాష్ట్ర ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయని మంత్రి ఆరోపించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలపై జగన్ తన పార్టీ క్యాడర్‌తో కలిసి నిరసనలు తెలపడం ద్వారా సైకో వ్యూహాలకు పాల్పడుతున్నారని డోల ఆరోపించారు. “జగన్ ప్రభుత్వం APERC (ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ […]
Dead Body Parcel Case : పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలన రేపిన డెడ్ బాడీ పార్సిల్ కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసు విచారణలో పోలీసులకు వరుస ట్విస్ట్ లు ఎదురయ్యాయి. నిందితులు తిరుమాని శ్రీధర్ వర్మ పాటు మూడో భార్య పెనుమత్స సుష్మ అలియాస్ విజయలక్ష్మీ, రెండో భార్య తిరుమాని రేవతి అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడు తిరుమాని శ్రీధర్ వర్మ క్రిమినల్ మైండ్ తో వదిన సాగి తులసి ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ చేసినట్లు […]
Anagani Satyaprasad : మాజీ సీఎం వైఎస్ జగన్‌ఫై మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శలు గుప్పించారు. ఇవాళ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. తన పాలనలో రాష్ర్ట విద్యుత్ రంగంపై దాదాపు లక్షా 30 వేల కోట్ల రూపాయల భారాన్ని మోపిన జగన్ ఇప్పుడు చిలకపలుకులు పలుకుతున్నాడని ఆయన మండిపడ్డారు. యూనిట్ కు ఐదు రూపాయలకు దొరికే విద్యుత్ కు బదులు 8 నుండి 14 రూపాయల వరకు కొనుగోలు చేసి ప్రజలపైన జగన్ రెడ్డి […]
Civil Supply Inspections : నంద్యాల బేతంచెర్ల గోదాములో సివిల్ సప్లై తనిఖీలు చేపట్టారు. సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ డైరెక్టర్ మహేష్ నాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. సివిల్ సప్లై జిల్లా మేనేజర్‌ను వెంట బెట్టుకొని తనిఖీకి వెళ్లారు మహేష్ నాయుడు. సమాచారం తెలిసి అప్పటికే గోడౌన్ నుంచి సిబ్బంది వెళ్లిపోయారు. రాత్రి 11 వరకు వేచి వుండి తాళాలు తెప్పించి డైరెక్టర్ మహేష్ నాయుడు తనిఖీ చేశారు. సిబ్బంది రికార్డులు మాయం చేసినట్లు సమాచారం. […]
YSRCP : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపుతో సామాన్యులపై భారాన్ని పెంచిన ప్రభుత్వ నిర్ణయం దారుణమని ఆ పార్టీ నేతలు విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపు కారణంగా ప్రజలపై రూ. 15,000 కోట్ల అదనపు భారం పడిందని వైసీపీ ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాష్ట్ర […]
నేడు తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈ రోజు (డిసెంబర్ 27) సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై తెలంగాణ […]
CM Revanth Reddy : మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ప్రధానిని గొప్ప ఆర్థికవేత్తలు, నాయకులు, సంస్కర్త , అన్నింటికంటే మానవతావాది అని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ సద్గుణం, నిష్కళంకమైన చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అని, అన్నింటికీ మించి నిర్ణయం తీసుకోవడంలో మానవీయ స్పర్శతో గుర్తించబడ్డారని రేవంత్ రెడ్డి ఒక […]
CM Chandrababu : భారత మాజీ ప్రధానమంత్రి, ప్రఖ్యాత ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి అపార లోటని పేర్కొన్నారు. జ్ఞానం, వినయం, సమగ్రతకు ప్రతీకగా నిలిచిన మన్మోహన్ సింగ్ మహా మేధావి, ప్రగాఢ రాజకీయ దూరదృష్టిగల నేతగా కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, ఆత్మీయులకు గురువారం రాత్రి ‘ఎక్స్’ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ప్రధానమంత్రి మరణం […]