తెలువారందరి ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడో ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వెళ్లిన వారందరూ ఇంటికి చేరుకొని బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అయితే భోగి, మకర సంక్రాంతి, కనుమగా ఇలా మూడు రోజులు పండుగను అత్యంత వైభవోపేతంగా తెలుగువారందరూ జరుపుకుంటారు. అయితే నేడు భోగి పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో వేకువజామునే భోగి మంటలు వేశారు. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పండుగ శోభను సంతరించుకుంది. వీధుల్లో రంగవల్లులు, గంగిరెద్దుల […]
నేడు యూపీలో తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేయనుంది. ఇటీవలే ఎన్నికల సంఘం 5 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో 7 దశల్లో 5 రాష్ట్రాల్లో పోలింగ్ జరుగనుంది. నేటి నుంచి అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ జరుగనుంది. వెస్టిండీస్‌లో సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ప్రపంచకప్ కోసం 16 జట్లు పోటీ పడుతున్నాయి. ఫిబ్రవరి 5న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. నేడు యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియ-ఇంగ్లాడ్ ఐదో […]
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో ఉదయం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. రహదారులపై వర్షాపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కాల్వలో చెత్తచెదారం తీయకపోవడంతో వర్షపు నీరు నిలిచిపోయిందని స్థానికులు వాపోతున్నారు. అంతేకాకుండా భారీ వర్షం కారణంగా పలు కాలనీల్లో వర్షపు నీరు చేరడంతో అధికారులు వర్షపు నీటిని తోడుతున్నారు. వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగి రహదారులపై ప్రవహిస్తోంది. ఇదిలా ఉండగా.. నైరుతి బంగాళాఖాతం […]
బీజేపీ విచ్ఛిన్నకర విధానం అమలు చేస్తోందని, తెలంగాణకి బీజేపీతో ప్రమాదం పొంచి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఓటమి లక్ష్యంగా పని చేస్తామని అన్నారు. బీజేపీ పట్ల టీఆర్ఎస్ మెతక వైఖరి అవలంబిస్తోందని, ఈ మధ్య బీజేపీ ఒడిపోవాలని కేసీఆర్ స్టేట్ మెంట్ ఇస్తున్నారు.. సంతోషమేనని ఆయన అన్నారు. కానీ కేసీఆర్ ప్రకటనలే వస్తున్నాయి.. కానీ ఆయన స్టేట్ మెంట్ ఎక్కడ లేదని ఆయన పేర్కొన్నారు. […]
అకాల వర్షాల వల్ల ఉమ్మడి వరంగల్, ఖమ్మం రైతులు తీవ్రంగా నష్టపోయారని కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నకీల విత్తనాల కారణంగా మిర్చి రైతులకు వచ్చే క్వింటాల్ మిర్చి కూడా అకాల వర్షాలతో రాకుండా పోయిందని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల భారీ వర్షాలకు ధాన్యం తడిచిపోయిందని ఆయన వెల్లడించారు. దాదాపు 500 కోట్ల పంట నష్టం జరిగిందని, పంట నష్టం జరిగితే ఏడేళ్లలో ఇంత […]
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇటీవల బండి సంజయ్ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడడం బంద్ చేయాలంటూ అగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కేసీఆర్, కేటీఆర్ మీద చేయి వేస్తే తెలంగాణ ప్రజలు ఉరికించి కొడతారన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళు కేసీఆర్ ను విమర్శిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ఎరువుల ధరలు […]
సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీసులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ కార్యాలయంలోని 3వ అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే కార్యాలయం కిందకు పరుగులు పెట్టారు. అంతేకాకుండా 5వ అంతస్థులోని సిబ్బంది భయంతో ఆఫీస్ టెర్రస్‌పైకి ఎక్కారు. వీరితో పాటు ఓ ఇద్దరు ఉద్యోగులు ప్రమాదం జరిగిన సమయంలో ఆఫీస్ లిఫ్ట్‌లో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది […]
గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో టీడీపీకి చెందిన చంద్రయ్య అనే వ్యక్తిపై నిన్న రాత్రి కత్తులతో, కర్రలతో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్యచేశారు. ఈ నేపథ్యంలో చంద్రయ్య హత్యపై టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శి లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా.. హత్యా రాజకీయాల వారసుడు జగన్ సీఎం అవ్వడంతో ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రశ్నించే వారిపై దాడులు, పోరాడే వారిని అంతమొందించడం అలవాటుగా మారిందిని ఆయన ఆరోపించారు. […]
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల సినిమా ఇండస్ట్రీపై వైసీపీ ఎమ్మెల్య చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం సృష్టించాయి. దీంతో నిర్మాతలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పందించారు. ప్రస్తుతు ఏపీ ఈ విషయం ముదురుతున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్‌తో భేటీ కానున్నారు. ఏపీ సినిమా టికెట్ల ధరలపై చర్చించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సీఎం జగన్ […]
మాచర్ల టీడీపీ ఇంచార్జీ జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరుడు చంద్రయ్యను నిన్న రాత్రి కొందరు దుండగులు కత్తులతో, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. వెల్దుర్తి మండలం గుండ్లపాడులోని చంద్రయ్య ఇంటి వద్ద ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. చంద్రయ్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించేందుకు పోలీసులు యత్నించారు. అయితే బ్రహ్మరెడ్డి వచ్చేవరకు చంద్రయ్య మృతదేహాన్ని తరలించవద్దని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. పోలీసులు ఆలస్యంగా వచ్చారంటూ చంద్రయ్య కుటుంబ […]