Gogikar Sai Krishna
Author- NTV Telugu-
NIMS : నిమ్స్‌లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
NIMS : నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్, కిడ్నీ దందా సాగుతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప స్పష్టం చేశారు. ప్రతిరోజూ వేలాది మంది, ఏటా లక్షలాది మంది పేద రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నిమ్స్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొంతమంది ఉద్దేశపూర్వకంగానే బురదజల్లుతున్నారని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను […] -
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
మణికొండలోని డాలర్ హిల్స్‌లో శనివారం లిఫ్ట్ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్ వైర్లు ఒక్కసారిగా తెగిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించడమే కాకుండా అపార్ట్మెంట్లోని నివాసితులను భయాందోళనకు గురిచేసింది. డాలర్ హిల్స్‌లోని ఒక అపార్ట్మెంట్ ఐదవ అంతస్తులో రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఇంచార్జీ కార్తీక్ రెడ్డి చేయబోయే పాదయాత్ర కు సన్నాహక సమావేశం జరిగింది. ఈ మీటింగ్ ముగించుకుని ఆరుగురు నాయకులు గ్రౌండ్ ఫ్లోర్‌కు […] -
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారుల సేవలను, వారి త్యాగాలను అధికారికంగా గుర్తించే దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌ను పరిష్కరిస్తూ, ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన గౌరవం , సౌకర్యాలు కల్పించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం జీఓ ఆర్టీ నం.679 జారీ చేసింది. తెలంగాణ కోసం […] -
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి అత్యంత కీలకమైన, భావోద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. కుల రాజకీయాల నుండి పొత్తుల వరకు, సనాతన ధర్మం నుండి దేశ ప్రయోజనాల వరకు అనేక అంశాలపై ఆయన తన మనసులో మాటను కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పొత్తుపై , క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తన్ను ఒక కులానికి, ప్రాంతానికి పరిమితం చేయాలని చూస్తున్న […] -
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొహెడ గ్రామంలో గుండెల్ని పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మోసం చేయడమే కాకుండా, తన కన్న బిడ్డను కూడా అమ్మేసిందని తెలియడంతో మనస్తాపానికి గురైన గోవర్ధన్ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొహెడ గ్రామానికి చెందిన గోవర్ధన్, సరిత గౌడ్ అనే యువతిని నాలుగేళ్ల క్రితం ఇంట్లో వారికి తెలియకుండా ప్రేమించి వివాహం చేసుకున్నాడు. […] -
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
Mother Saves Children Under Moving Train in Bihar Viral Video : అమ్మ అంటే ప్రేమ మాత్రమే కాదు.. అవసరమైతే మృత్యువుతో పోరాడే ధైర్యం కూడా అని ఒక ఘటన నిరూపించింది. తన కళ్లెదుటే మృత్యువు రైలు రూపంలో దూసుకొస్తున్నా, ఏమాత్రం భయపడకుండా తన బిడ్డలను గుండెలకు హత్తుకుని ప్రాణాలతో బయటపడింది ఒక వీరమాత. ఒళ్లు గగుర్పొడిచే ఈ హృదయ విదారక ఘటన బిహార్‌లోని సమష్టిపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. సమష్టిపూర్ జిల్లా షాపూర్ పటోరి […] -
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
జనసేన పార్టీ ప్రస్థానంపై ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతిలో జరిగిన ఒక కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు. కేవలం 150 మంది సభ్యులతో తెలంగాణలో పుట్టిన జనసేన పార్టీ, నేడు 21.50 లక్షల క్రియాశీలక సభ్యత్వాలతో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి కూడా […] -
FSSAI : పామాయిల్‌పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
భారతదేశ ఆహార భద్రతలో , వంట నూనెల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో పామాయిల్ కీలక పాత్ర పోషిస్తోందని నిపుణులు స్పష్టం చేశారు. సరైన ఆధారాలు లేకుండా పామాయిల్‌పై దుష్ప్రచారం చేయడం సరికాదని ఈ వారం జరిగిన ఒక కార్యక్రమంలో నిపుణులు అభిప్రాయపడ్డారు. పీహెచ్‌డీసీసీఐ (PHDCCI) , ఆయుష్ కమిటీ నిర్వహించిన ఈ సదస్సులో ప్రభుత్వ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొని పామాయిల్ వినియోగంపై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (FSSAI) […] -
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కేవలం ఒక సంఖ్య కాదని, అది పార్టీ విలువలను, అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక గొప్ప యజ్ఞమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అమరావతిలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొని, జనసైనికులను ఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు కార్యకర్తలు పడుతున్న కష్టాన్ని, పార్టీ ఇస్తున్న భరోసాను ఆయన వివరించారు. పార్టీ […] -
Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వార్త వాహనదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతి ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూసివేస్తారని, కేవలం పని దినాల్లో మాత్రమే పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంటాయని జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ పౌరసరఫరాల శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇవన్నీ కేవలం అవాస్తవాలని స్పష్టం చేస్తూ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర […]
తాజావార్తలు
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!