Adilabad Police: పోలీసులా మజాకా..! కటౌట్‌లతో ప్రమాదాల కట్టడి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Cop, Real Impact: ఫొటో చూశారా..? అచ్చం పోలీసు కానిస్టేబుల్ నిల్చొన్నట్టు పక్కనే పోలీసు కారు ఉన్నట్లు కనిపిస్తుంది కదూ.. నిజంగా అక్కడ కానిస్టేబుల్ నిలబడ్డారని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే.. అక్కడ ఉన్నది నిజమైన పోలీసు కాదు.. అది నిజమై పోలీస్ కారూ కాదు.. ఇది ఓ కటౌట్ మాత్రమే.. జిల్లాలో జాతీయ రహదారిపై వేగ నియంత్రణ చేస్తూ ప్రమాదాలను అరికట్టడానికి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దూర దృష్టి , మేధాశక్తి తో జిల్లాలో నూతనంగా జాతీయ రహదారి – 44 పై ప్రమాదాల నివారణకు ఇలా వినూత్న రీతిలో చర్యలు తీసుకున్నారు.
READ MORE: KTR: ఈవీఎం వద్దు.. బ్యాలెట్ పేపర్ ముద్దు
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
హైవేపై.. అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న హాట్స్పాట్లను గుర్తించి అక్కడ వేగ నియంత్రణ కోసం ప్రత్యేకంగా డయల్ 100 వాహనం, ట్రాఫిక్ కానిస్టేబుల్ తో కూడిన కటౌట్ లను ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు వాహనదారులు వేగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని గుడిహత్నూర్ మేకల గండి వద్ద నేరడిగొండ మండలం బంధం ఎక్స్ రోడ్డు వద్ద రెండు చోట్ల ఈ కటౌట్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. వాహనం పోలీసులు ఉంటేనే వాహనదారులు ప్రజలు సరైన ట్రాఫిక్ నియమ నిబంధనలు వేగ నియంత్రణ చేస్తూ ప్రమాదాలకు గురికాకుండా ఉంటారని తెలిపారు. వాహనదారులకు స్వీయ వేగ నియంత్రణ లేకపోవడం ద్వారా గత రెండు సంవత్సరాలలో ప్రమాదాలు ఎక్కువగా జరిగాయని.. ఆ ప్రదేశాలను గుర్తించి ప్రాణనష్టాన్ని అరికట్టడానికి ప్రత్యేకంగా కటౌట్లను చేశామన్నారు. ఈ కటౌట్‌లు చూసి వాహనదారులు బ్రేకులు వేస్తూ.. వేగాన్ని తగ్గిస్తున్నారని.. హెల్మెట్ ధరిస్తున్నారని చెప్పారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!