దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 934 పాయింట్ల లాభంతో 52,532 వద్ద ముగియగా.. నిఫ్టీ 288 పాయింట్ల లాభంతో 15,638 వద్ద స్థిరపడింది. మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే ధోరణిని ప్రదర్శించాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఒక్క నెస్లే ఇండియా మాత్రమే నష్టాలను చవిచూసింది. మిగతా కంపెనీల షేర్లు లాభాలను గడించాయి. అత్యధికంగా లాభాలను గడించిన కంపెనీలలో టెక్ దిగ్గజాల షేర్లు ఉన్నాయి. విప్రో, ఇన్ఫోసిస్, టెక్ […]
మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి -మహా వికాస్ అఘాడీ సర్కార్ చిక్కుల్లో పడింది. శివసేనకు చెందిన మంత్రి ఏక్‌నాథ్ షిండే 22 మంది ఎమ్మెల్యేలతో అజ్ఞానతంలోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. గుజరాత్‌లోని సూరత్‌లో గల ఒక హోటల్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఏక్‌నాథ్ షిండేతో పాటు కొందరు ఎమ్మెల్యేలు తమకు అందుబాటులోకి రావడం లేదని శివసేన నేతలు కూడా అంగీకరిస్తున్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ […]
వైసీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సంపాదించారు. 1998లో డీఎస్సీ రాసిన ఆయన ఎట్టకేలకు ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 1998 డీఎస్సీ పోస్టింగుల కోసం అభ్యర్థులు సుమారు 23 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. 1998 డీఎస్సీపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఇన్నాళ్లూ పోస్టింగులు వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా వివాదాలు పరిష్కారం కావడంతో సీఎం జగన్ 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాల కేటాయింపు ఫైలుపై సంతకం చేశారు. ఉద్యోగానికి ఎంపికైన వారి జాబితాలో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ […]
పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారీ గతంలో ఐపీఎల్ ద్వారా క్రికెట్ ప్రేక్షకులకు పరిచయం ఉన్నవాడే. క్రీడల మంత్రిగా పనిచేస్తున్నా ఆయన మాత్రం ఇంకా క్రికెట్ ఆడుతూ తనలో ఇంకా ఆడే సత్తా ఉందని నిరూపిస్తున్నాడు. ఇటీవల రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు బాది అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. మంత్రి పదవితో బిజీగా ఉన్నా ఇంకా క్రికెట్‌పై దృష్టి పెట్టడం అంటే మాములు మాటలు కాదు. ఈ సందర్భంగా అటు మంత్రి […]
ఏపీలో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. టైర్-2 నగరాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ఇన్ఫోసిస్ నిర్ణయించింది. ఈ మేరకు విశాఖలో విడతల వారీగా మూడు వేల సీటింగ్ కెపాసిటీ గల క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రతినిధులు వెల్లడించారు. ఇటీవల ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో ఇన్ఫోసిస్ ప్రతినిధులు సమావేశమై క్యాంపస్ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలపై చర్చించారు. విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏర్పాటు చేయడంపై మంత్రి గుడివాడ […]
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళన చేసేందుకు ఆర్మీ అభ్యర్థులు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు రైల్వే శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి గురువారం రాత్రే యువకులు హైదరాబాద్‌కు తరలివచ్చారని.. జిల్లాల వారీగా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకుని, ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసుకున్నట్లు తెలుసుకుని అధికారులు విచారణ చేపట్టారు. మరోవైపు తొలుత శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బయట ఓ బస్సు అద్దాలను ఆందోళనకారులు పగులగొట్టారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఆందోళనకారులు […]
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ఆర్పీఎఫ్ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో 8 మందికి గాయాలయ్యాయి. మృతుడు వరంగల్‌కు చెందిన దామోదర్‌గా పోలీసులు గుర్తించారు. దామోదర్ మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ 8 మందికి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. కాగా సికింద్రాబాద్ ఘటనతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు సికింద్రాబాద్ పరిధిలో 71 రైళ్లను రైల్వేశాఖ […]
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మరో కొత్త సినిమాను లైన్‌లో పెట్టారు. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఓ మూవీలో రజినీకాంత్ నటిస్తున్నారు. ఈ సినిమా రజినీకాంత్ కెరీర్‌లో 169వ సినిమాగా వస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర బృందం ఖరారు చేసింది. నెల్సన్-రజినీకాంత్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీకి ‘జైలర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసింది. ఈ మేరకు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో కత్తికి రక్తపు మరకలు ఉన్నట్లు చూపించారు. జైలులోని ఖైదీలు నేపథ్యంలో […]
అగ్నిపథ్ స్కీంకు సంబంధించిన అంశంపై ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పలు రైళ్లకు, స్టాళ్లకు నిప్పు పెట్టడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్త ఘటనల కారణంగా కేంద్రం ఆదేశాల మేరకు అన్ని రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు […]
అగ్నిపథ్ స్కీంకు సంబంధించి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. స్టేషన్ నుంచి ఆందోళనకారులు బయటకు వెళ్లకపోవడంతో ముందస్తు జాగ్రత్తగా స్టేషన్ నుంచి బయల్దేరాల్సిన అన్ని రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్‌కు రావాల్సిన కొన్ని రైళ్లను ఇతర స్టేషన్లకు మళ్లించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలను అదుపులోకి తీసుకొస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. నిరసనకారులను బయటకు పంపించే ప్రయత్నం జరుగుతోందని, రైల్వే ఆస్తులకు ఎంతమేర నష్టం జరిగిందో ఇప్పుడే చెప్పలేమన్నారు. సికింద్రాబాద్ నుంచి […]