ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామంలో దారుణం జరిగింది. పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్యకు పాల్పడ్డారు. బాలికపై బండరాయితో మోది హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఉదయం 6 గంటల ప్రాంతంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది మైనర్ బాలిక. కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం బాలికను వివస్త్రను చేసి హత్య, అత్యాచారానికి పాల్పడినట్లు […]
రోడ్డు ప్రమాదాలు కామన్ అయిపోయాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించడం విషాదం నింపింది. ఘన్పూర్(ఎం) వద్ద ఆర్టీసీ బస్సు కారును ఢీ కొట్టిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సాయంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సిరిసిల్ల వైపు నుంచి కరీంనగర్-1 డిపో బస్సు కామారెడ్డికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదం కారణంగా […]
హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. అర్దరాత్రి రెండు ఏటీఎంలలో చోరీకి విఫలయత్నం చేశారు. పోలీసులు అప్రమత్తం కావడంతో దొంగలు పారిపోయారు. మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్దరాత్రి ఎస్ బి ఐ బ్యాంక్ ఏ టీ ఎంతో పాటు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో చోరికి ప్రయత్నించారు దొంగలు. దోబీఘాట్ లోని జయ్ హింద్ హోటల్ సమీపంలో ఉన్న రెండు ఏటీఎంలలోకి ప్రవేశించారు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు. అర్దరాత్రి ఏటీఎం సెంటర్ లోకి ప్రవేశించి చోరీకి ప్రయత్నించారు. […]
నార్కోటిక్ వింగ్ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది.. స్థానిక పోలీసుల సమన్వయంతో జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తూ డ్రగ్ ఫెడ్లర్ లకు చుక్కలు చూపిస్తోంది ఈ వింగ్.. తాజాగా అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ డ్రగ్ ఫెడ్లర్ ఆట కట్టించింది.. డ్రగ్ ఫెడ్లర్ తో పాటు మరో నలుగురు కంజ్యుమర్లను కూడా అదుపులోకి ఈ వింగ్ అదుపులోకి తీసుకుంది. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం నార్కోటిక్ ఎన్ఫోర్సుమెంట్ వింగ్ ను ఏర్పాటు చేసింది… ఈ వింగ్ […]
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకని వంద మంది మహిళలు యాదాద్రి భువనగిరిలో జిల్లాలోని ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. అందులో 20 మందికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి పడుకోబెట్టారు. ఆపరేషన్ చేయబోమంటూ డాక్టర్లు చేతులెత్తేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది.తుర్కపల్లి, రాజపేట్ మండలాల నుంచి వంద మంది మహిళలను బీపీఎల్ క్యాంపు తీసుకొచ్చారు. ఒకేసారి వంద మంది రావడంతో మేము కొంతమంది ఆపరేషన్ చేస్తామని చెప్పి మిగిలిన వారికి చేయమని డాక్టర్లు చెప్పారు. […]
త్వరపడండి… మరో 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మీ వెహికల్‌పై పెండింగ్ చలాన్ డిస్కౌంట్‌తో చెల్లించారా ?? ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన గడువు ముగిశాక ఒకవేళ పెండింగ్ చలాన్ ఉన్నాయే అనుకోండి ఇక చర్యల విషయంలో తగ్గేదేలే అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. తెలంగాణ ప్రజలపై పెండింగ్ చలాన్ వాహనదారులపై ఆర్థిక భారం తగ్గించడానికి భారీ డిస్కౌంట్ల ను ప్రకటించింది తెలంగాణ పోలీస్ శాఖ. మీరు ఊళ్లో లేకపోయినా సరే..ఆన్లైన్లో అయినా పెండింగ్ చలానాలు చెల్లించమంటున్నారు […]
సికింద్రాబాద్ పరిధిలోని బోయిగూడ అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమాద ఘటనను త్రీడీ స్కానర్‌తో పరిశీలించిన ఫైర్ సేఫ్టీ, క్లూస్ టీమ్స్ కీలక ఆధారాలు సేకరించాయి. 11 మంది కార్మికులు సజీవదహనం కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ గోదాం యాజమానిలో ఒకరి అరెస్ట్ చేయగా, మరొకరు పరారీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పలు కీలక ఆధారాలను ఫైర్ సేఫ్టీ, క్లూస్ టీమ్స్ సేకరించింది. షార్ట్ సర్క్యూట్‌తో ఎగిసిపడ్డ నిప్పు రవ్వలే ప్రమాదానికి […]
మానసిక ప్రశాంతత కోసం గుడికెళతారు భక్తులు. పూజారులు పూజలు చేసి భక్తులకు ప్రసాదం అందిస్తారు. కానీ పూజారులే భక్తులపై దాడి చేసిన ఘటన సికింద్రాబాద్ లో కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ పూజారులు భక్తుడిపై దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. ఆలయాల్లో భక్తులకు భద్రత లేకపోతే ఎలా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. భక్తుల పూజారులు దాడి చేసినా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. దేవునికి […]
హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధి కర్ణంగూడ దగ్గర జరిగిన కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో రియల్టర్ ఆస్పత్రిలో రాఘవేందర్ రెడ్డి చికిత్స అందుకుంటూ మరణించాడు. ఈ కాల్పుల కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలపై గతం లో పలు మార్లు రాచకొండ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తమ భూమిని కబ్జా చేస్తున్నారని రాచకొండ పోలిసులను కలిశారు లేక్ […]
అసాంఘీక కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా డార్క్ వెబ్ నెలవైంది. ఈ వెబ్సైట్లో దొరకనిది అనేది ఉండదు. మనిషిని చంపాలన్న మనిషిని వెంటాడి కిడ్నాప్ చేయాలని, డ్రగ్స్ కావాలన్నా, ఆయుధాలు కావాలని డార్క్ వెబ్‌లో విచ్చలవిడిగా దొరుకుతాయి. డార్క్ వెబ్ పైన ఎవరు నిఘా పెట్టలేదు. అయితే హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారిన డార్క్ వెబ్ పైన నిఘా పెట్టారు. సిటీ పోలీస్ నుంచి ఎప్పటికప్పుడు డార్క్ వెబ్ పై అనాలసిస్ చేస్తున్నారు. అంతేకాదు […]