నీట్ ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. దీనిపై వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని వెంటనే దర్యాప్తు చేపట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ని డిమాండ్ చేస్తున్నారు. జూన్ 4న వెలువడిన నీట్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం మే 5న సాయంత్రం 4 గంటల సమయంలో ప్రశ్నపత్రం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేయడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు ఆమె చెప్పారు.