‘విరాట పర్వం’ : ఉగాది స్పెషల్ గా సాయి పల్లవి న్యూ పోస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. ‘రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఉగాది పండగ శుభాకాంక్షలు తెలుపుతూ సాయి పల్లవి పిక్ ను విడుదల చేశారు. తెలుగుతనం ఉట్టిపడుతున్న ఈ పిక్ లో సాయి పల్లవి లుక్ అద్భుతంగా ఉంది. సాధారణ అమ్మాయి లుక్ లో గడపకు బొట్లు పెడుతూ ఉన్న సాయి పల్లవిని చూస్తుంటే పక్కింటి అమ్మాయిలా కన్పిస్తోంది. ఈ పిక్ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. ‘శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు’ అంటూ ‘విరాటపర్వం’ టీం ప్రేక్షకులను విష్ చేసింది. కాగా 1990నాటి విప్లవ కథలోని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియమణి ‘భారతక్క’ అనే పాత్రలో కనిపించనుంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ‘విరాట పర్వం’ చిత్రాన్ని సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్, పోస్టర్లు, టీజర్ ఆకట్టుకోగా సినిమా విడుదల గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఏప్రిల్ 30న ఈ చిత్రం విడుదల కానుంది.
Also Read
- Tags
- Happy Ugadi
- Rana
- Virata Parvam
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..