NTV WebDesk
Author- NTV Telugu-
Y Satya Kumar: పోలవరంని అందరూ ఏటీఎంలా చూశారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ స్పందించారు. ఆ ప్రాజెక్ట్‌ను ప్రతిఒక్కరూ ఏటీఎంలానే చూశారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రులు వస్తున్నారు, పోతున్నారే తప్ప.. ఫోలవరంపై ఫోకస్ పెట్టడం లేదని ఆరోపించారు. పోలవరం మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కానీ, ఏమీ తేల్చడం లేదని దుయ్యబట్టారు. పని పూర్తి చేస్తే కేంద్రం నిధులిస్తుందని, కానీ ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయని ఆగ్రహించారు. ఏపీలో చెత్త తొలగించాలన్నా.. […] -
KTR: ఐటీలో అద్భుతమైన పురోగతి సాధించాం
గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఐటీలో అద్భుతమైన పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. 2021-22 ఏడాదికి ఐటీ వార్షిక నివేదికను హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా సంక్షోభం తర్వాత సాధారణ స్థితికి రావడానికి అనేక రంగాలు ఆపసోపాలు పడుతుంటే.. తెలంగాణలో ఐటీ రంగం శర వేగంగా దూసుకుపోతుందని, గత రికార్డులను బద్దలు కొడుతూ 2021-22 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను […] -
Hyderabad: మరోసారి భాగ్యనగరానికి మోదీ, షా.. మూడురోజులు బస
కొద్దిరోజుల నుంచి తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్లు తెలంగాణకు క్యూ కట్టడంతో.. పాలిటిక్స్ జోరందుకుంది. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెంచింది. మరోవైపు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై కసరత్తును ప్రారంభించింది. ఈ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించునున్నారు. ఇందులో భాగంగా బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.ఎల్. సంతోష్ నగరానికి బుధవారం వచ్చారు. కాగా, మూడు రోజల పాటు జరిగే ఈ […] -
Ambati Rambabu: చంద్రబాబు, దేవినేని ఉమాకు సవాల్.. చర్చకు సిద్ధమా?
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలోని తప్పిదాలపై చర్చకు రావాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, దేవినేని ఉమాలకు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. డయాఫ్రమ్ వాల్ ఎవరి చర్య వల్ల దెబ్బ తిందో చర్చ జరిగి తీరాల్సిందేనని ఆయన ముక్తకంఠంతో అన్నారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టడం చారిత్రక తప్పిదమన్న రాంబాబు.. ఆ తప్పు వల్లే వరదలకు వాల్ దెబ్బతిందన్నారు. దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్‌కు మరమ్మత్తులు చేపట్టాలా? లేక కొత్తది నిర్మించాలా? […] -
Rishikonda: రిషికొండలో నిర్మాణాలకు సుప్రీంకోర్ట్ గ్రీన్ సిగ్నల్
విశాఖ పట్నంలోని రిషికొండలో టూరిజం భవనాల నిర్మాణాలపై ఎన్జీటీ విధించిన స్టే ఎత్తివేయాలని..ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రిషికొండలో నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. అక్కడ చదును చేసే ప్రాంతంలో నిర్మాణాలు చేసుకునేందుకు సుప్రీం కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే నిర్మాణాలున్న ప్రాంతంలో యథావిథిగా నిర్మాణాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. రుషికొండ ప్రాజెక్ట్ కేసు విచారణ హైకోర్టుకు బదిలీ చేసింది. ట్రిబ్యునల్ పరిధి కంటే […] -
Prabhas: తమిళ దర్శకుడి ఆశలపై నీళ్లు చల్లిన రెబెల్ స్టార్..?
స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఏ దర్శకుడికి ఉండదు చెప్పండి? మరీ ముఖ్యంగా.. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో ఒక్క సినిమా అయినా చేయాలని స్టార్ డైరెక్టర్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాస్‌తో సినిమా చేస్తే.. జాతీయ స్థాయిలో ఓ వెలుగు వెలిగిపోవచ్చన్నది దర్శకుల భావన. అందుకే.. తమ వద్ద ఉన్న స్క్రిప్టులు తీసుకొని, ప్రభాస్ ఇంటి ముందు క్యూ కడుతున్నారు. ఈ ఆరడుగుల ఆజానుభావుడు కూడా.. చేతినిండా సినిమాలున్నా, నచ్చిన కథలకు గ్రీన్ సిగ్నల్ […] -
Bhatti Vikramarka: కాంగ్రెస్ చింతన్ శిబిర్.. అంతా రెడీ
ఇవాల్టి నుంచి కాంగ్రెస్ చింతన్ శిబిర్ కార్యక్రమం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈమేరకు కీసరలో రెండు రోజుల పాటు మేధోమథన సదస్సు జరగనుంది. ఉదయ్‌పూర్ తీర్మానాలపై చర్చించి వాటికి టీపీసీసీ ఆమోదం తెలుపుకుంటుంది. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా భవిష్యత్తు కార్యాచరణపై నేతలు చర్చించుకుంటారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కమ్ ఠాగూర్ హాజరు కానున్నారు. 2 రోజుల సమావేశాల్లో రాజస్థాన్ లోని ఉదయ్ […] -
Fact Check: అలాంటి ప్రచారం చేస్తే కఠినచర్యలు
2022 ఏడాదికిగాను జగనన్న అమ్మఒడి, వాహనమిత్ర పథకాలను ఆర్థిక ఇబ్బందులు కారణంగా రద్దు చేయడం జరుగుతుందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ అన్నది అసలు మనుగడలోనే లేదు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేవిధంగా దుష్ర్పచారం చేసేవారు ఎంతటివారైనా ఉపేక్షించం, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు ఏపీ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ పేరుతో 2022 జగనన్న […] -
Twitter War: అయ్యన్న తూటాలు.. విజయసాయి కౌంటర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకి ఎలా వేడెక్కుతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎంపీ విజయసాయి రెడ్డి మధ్య ట్విటర్ వార్ మొదలైంది. తొలుత తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అయ్యన్నపాత్రుడు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దుర్మార్గ, రాక్షస పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని తాను దేవుణ్ణి ప్రార్థించానన్నారు. తమని రక్షించడంతో పాటు ‘నిన్ను నువ్వు కూడా […] -
Harish Rao: సివిల్స్ విజేతలకు విందు
హైదరాబాద్‌లోని తన నివాసంలో సివిల్స్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన పలువురికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అల్పాహార విందు ఇచ్చారు. సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్, మెంటార్ మల్లవరపు బాలలత నేతృత్వంలో సివిల్స్ ర్యాంకర్లు హరీశ్‌రావును కలిశారు. ఈ సందర్భంగా వారిని మంత్రి హరీశ్‌రావు ఘనంగా సత్కరించారు. సివిల్స్‌లో ర్యాంకులు సాధించి తెలుగువారందరికీ గర్వకారణంగా నిలిచారని మంత్రి అభినందించారు. స్వయంగా ఐఏఎస్ అయిన బాలలత.. హైదరాబాద్‌లో ఐఏఎస్ శిక్షణ సంస్థ సీఎస్‌బీ అకాడమీని ఏర్పాటుచేసి ఇప్పటివరకు వందమందికిపైగా […]
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!