ఎన్నికల్లో వైఎస్ జగన్ ఇచ్చిన మేనిఫెస్టో లో ప్రతి అంశాన్ని నెరవేర్చేలా చర్యలు తీసుకున్నారు. మేనిఫెస్టో లో ఇచ్చి హామీల్లో నూటికి 94శాతం హామీలు సీఎం నెరవేర్చారు అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రతి లబ్దిదారుడికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలో నగదు బదిలీ చేశారు. 2ఏళ్ల పాలనపై సీఎం విడుదల చేసిన పుస్తకాన్ని ప్రతి లబ్ది దారుడికి పంపిస్తాం. సంక్షేమం అభివృద్దిని రెండు కళ్లుగా ప్రభుత్వం భావిస్తోంది. వైఎస్ […]
సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన గిల్.. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటన కోసం ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉంది ఇన్‌స్టాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. అందులో… ఓ అభిమాని ‘మీరింకా ఒంటరిగానే ఉన్నారా…? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ…. ‘అవును నేనింకా ఒంటరిగానే ఉన్నా. ఇప్పట్లో ఎవరితోనూ […]
పిల్లలే థర్డ్ వేవ్ కరోనా బారిన ఎక్కువగా పడతారని చెప్పలేం అని…తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పిడియాట్రిక్ కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ డా. చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తాజాగా ఎన్టీవీతో మాట్లాడిన ఆయన ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. పిల్లలకు సంబంధించి వైద్య సదుపాయాల కల్పన కూడా దీనిలో భాగం అన్నారు. ఫిబ్రవరిలో నిర్వహించిన సీరో సర్వేలో పిల్లల్లో కూడా దాదాపుగా పెద్దలతో సమానంగా యాంటి బాడీస్ గమనించారు అని పేర్కొన్నారు. అయితే […]
సీఎం జగన్ మోహన్ రెడ్డికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖ రాసారు. కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ పిల్లలను ప్రభుత్వమే ఆదుకోవాలి. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ను 25 లక్షలకు పెంచాలి. ఆధారం కోసం కోవిడ్ పాజిటివ్ టెస్టునే కాకుండా, డెత్ సర్టిఫికెట్ ను కూడా అంగీకరించాలి . అనాధలుగా మారిన పిల్లలకు ఉపశమనం కోసం తక్షణమే 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేషన్ వరకూ పిల్లల […]
రైతులకు తెలంగాణ శుభవార్త చెప్పింది. ఈ వానాకాలం సాగుకు వచ్చే నెల 15 నుంచి రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. జూన్ 25 లోపు రైతుల ఖాతాల్లో నగదు జమను పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. పార్ట్-బీ నుంచి పార్టీ-ఏ జాబితాలో చేర్చిన భూములకు సైతం ఈసారి రైతుబంధు సాయం వర్తింపజేయనున్నట్లు తెలిపింది. జూన్ 10ని కట్టాఫ్ తేదీగా నిర్ణయించి రైతుబంధు వర్తింపజేయనున్నట్లు వెల్లడించింది. వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ ఈరోజు ప్రగతి భవన్‌లో […]
వరంగల్ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్ దందాకు సామాన్యులు విలవిలాడుతున్నారు. అయితే కరోనా కష్టకాలంలో ప్రజల దగ్గర నుండి డబ్బులు దండుకుంటూ రోగులు, వారి బంధువులను ఇబ్బంది పెడుతున్న ప్రైవేట్ హాస్పిటళ్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వరంగల్ జిల్లాలో మొత్తం. 11 హాస్పిటల్స్ కి నోటీసు జారీ చేశారు. జిల్లా స్థాయిలో 5 హాస్పిటల్స్ కి రాష్ట్ర స్థాయి నుండి 6 హాస్పత్రులను నోటీసులు జారీ చేశారు. ఒక్కరోజుకు 30 వేల నుండి 50 వేలు చార్జీ […]
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 2,982 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,74,026 కి చేరింది. ఇందులో 5,33,862 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 36,917 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 21 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన […]
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం లోడ్ కోసం వచ్చిన లారీని అడ్డుకున్నారు రైతులు. సన్నరకం ధాన్యాన్ని కాంటాలు పెట్టకుండా దొడ్డు రకం ధాన్యాన్ని లోడ్ చేయించేందుకు వచ్చిన అధికారులతో పాటు లారీని అడ్డుకున్నారు రైతులు. లారీ టైర్ కింద పడుకుని నిరసన వ్యక్తం చేసారు ఓ రైతు. వెంటనే సన్నరకం ధాన్యం కాంటాలు పెట్టి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేసారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యనిర్వహణ అధికారిపై […]
కరోనాతో తల్లి మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకులోనై కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుబాన్ కాలనీలో శనివారం ఈ విషాద ఘటన జరిగింది. చెరువులోకి దూకి బలవన్మరణానికి పాల్పడే ముందు యువకుడు శ్రీహరి (22) సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఇందులో తన కుటుంబ పరిస్థితిని వివరిస్తూ తన ఆవేదనను వెలిబుచ్చాడు.కరోనా బారినపడిన మా అమ్మ రుక్మిణి(60) చికిత్స పొందుతూ గచ్చిబౌలిలోని ప్రైవేట్ దవాఖానలో మృతి చెందింది. రూ. 10 లక్షలు […]
టీడీపీ పార్టీ నుంచి జూమ్ పార్టీ గా మారింది. చంద్ర బాబు నాయుడు జూమ్ పార్టీ అధ్యక్షులు అని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. కరోనా వచ్చిన జగన్ అని ప్రాజక్ట్ లు పూర్తి చేయడానికి పని చేస్తున్నారు. కరోనా వచ్చాక మీరు ఇంట్లో నుంచి బయటకు రాకుండా కేవలం జూమ్ ల ద్వారా విమర్శలు చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం ఒక సంక్షేమ పథకాన్ని కూడా అవ్వలేదు. ప్రతి పక్ష నాయుకుడిగా ప్రజల కోసం […]