సిఎం జగన్ రికార్డ్స్ సృష్టిస్తే…40 ఏళ్ల ఇండస్ట్రీ కొడుకు మాత్రం తుక్కైపోయాడు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టిడిపి అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. దేశంలోని కీలక రాజకీయ నేతల కుమారులు రాజకీయాల్లో బాగా రాణిస్తుంటే.. లోకేష్ మాత్రం తుక్కైపోయాడని కౌంటర్ వేశారు. “వైస్సార్ కుమారుడు రికార్డ్స్ సృష్టించారు. స్టాలిన్ కుమారుడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచాడు. కేసీయార్ కుమారుడు గెలిచాడు. ములాయం కుమారుడు గెలిచాడు. థాక్రే కుమారుడు గెలిచాడు. 40ఏళ్ల ఇండస్ట్రీ కొడుకు మాత్రం తుక్కైపోయాడు – స్టాన్ ఫోర్డ్ ప్రోడక్ట్ అని బిల్డప్ ఇస్తాడు. తల్లిదండ్రులిద్దరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినప్పుడు పిల్లలకు వ్యాధి సోకకుండా సిఎం జగన్ గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 32 బాలల సంరక్షణ సంస్థలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సంక్షోభ సమయంలో దేశంలోనే ఇటువంటి మానవత కనబర్చిన రాష్ట్రం మనది. యువ సిఎం ట్రెండ్ సెట్ చేశారు. ప్రభుత్వం వద్దని మొత్తుకున్నా కట్టప్ప లాంటి నిమ్మగడ్డను వాడుకుని స్థానిక ఎన్నికలు జరిపించాడు బాబు. కరోనా వ్యాప్తికి కుట్ర పన్నిన పాపం ఆయనను, పచ్చ బ్యాచిని వదిలి పెట్టదు. ఎన్నికలు లేకుంటే పాజిటివ్ కేసుల్లో రాష్ట్రం చిట్ట చివరన ఉండేది. ఇంత ఆందోళనకర పరిస్థితులు ఉండేవి కాదు.” అంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఇక అంతకు ముందు ట్వీట్ లో ” అగ్గి ఎక్కడ ఉందో అక్కడ నీళ్లు చల్లాలి. దిల్లీ వైపు చూసే ధైర్యం లేక రాష్ట్రంలో నీళ్లు కుమ్మరిస్తే జారి పడతావ్ చంద్రబాబు. ఇప్పటికే మోకాళ్లు విరగ్గొట్టుకుని నడవలేక పాకుతున్నావ్. మంచం పాలు కాకుండా చూసుకో. విశ్వసనీయత కోల్పోయాక గారడీలు చేసినా, నాటకాలాడినా వృథా ప్రయాస అవుతుంది.” అంటూ చురకలు అంటించారు విజయసాయిరెడ్డి.
Also Read
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
- Tags
- Nara Lokesh
- tdp
- vijayasaireddy
తాజావార్తలు
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!