కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమంలో…చాలా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అంబేద్కర్ విగ్రహం వైపు ర్యాలీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బయలు దేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఇందిరా పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. read also : సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ ధర్నాచౌక్ నుంచి కాంగ్రెస్ నేతలు బయటకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాట్లు చేశారు పోలీసులు. కార్యకర్తల భుజాలపై ఎక్కి […]
ప్రగతిభవన్ లో తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం అయింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ పార్లమెంటరీ పార్టీ భేటీ అయింది. ఈ సందర్భంగా తెరాస లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో సమావేశమైన సీఎం కేసీఆర్… పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. read also : ముల్లును ముల్లుతోనే తీయాలనే ప్లాన్‌లో ఎమ్మెల్సీ తోట! కేంద్రం ఖరారు చేసిన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి అంశంపైనా కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు సీఎం కేసీఆర్. […]
ముల్లును ముల్లుతోనే తీయాలని చూస్తున్నారు ఆ నాయకుడు. ఇప్పటికీ వెంటాడుతున్న సమస్య తన రాజకీయ భవిష్యత్‌కు అడ్డుపడకూడదని రివర్స్ ప్లాన్ వేశారట. తనకు వ్యతిరేకమని ప్రచారం జరుగుతున్న వర్గంతోనే ఘన సన్మానం చేయించుకుని శత్రు శిబిరానికి షాక్ ఇచ్చారట. ఇంతకీ ఇవన్నీ వర్కవుట్ అవుతాయా? కేసు విచారణలో ఉండగానే ఎమ్మెల్యేగా గెలిచారు.. ఇప్పుడు ఎమ్మెల్సీ! తోట త్రిమూర్తులను శిరోముండనం కేసు నీడలా వెంటాడుతోంది. తాజాగా ఎమ్మెల్సీ అయినా ఆయన్ను శిరోముండనం కేసుకు బాధ్యుడిగా చేస్తూ బర్తరఫ్ చేయాలని […]
ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. అందరినీ కలుపుకొని పోకుండా.. సొంత కోటరీని ప్రమోట్ చేసుకుంటున్నారట. ఇంకేముందీ ఎమ్మెల్యేపై భగ్గుమనేవాళ్ల సంఖ్య పెరిగింది. వర్గాలు పుట్టుకొచ్చాయి. ఎవరి కుంపటి వారిదే. ప్రస్తుతం మూడు గ్రూపులు.. ఆరు తగాదాలుగా ఉందట అక్కడి టీఆర్‌ఎస్ పరిస్థితి. ఎక్కడో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. మదన్‌రెడ్డికి బంధువులతో పొసగడం లేదా? మదన్‌రెడ్డి. మెదక్ జిల్లా నర్సాపూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే. నియోజకవర్గంలో ఉన్న ఆధిపత్య పోరు కారణంగా.. సొంత పార్టీ నేతలే ఆయనపై ఒంటికాలిపై […]
చిత్తశుద్ధి లేని శివపూజలా ఉందట.. తెలంగాణలో ఉద్యోగ ఖాళీల గుర్తింపు. నెలల తరబడి కసరత్తు చేశామని చెబుతూ.. అధికారులు ఇచ్చిన జాబితాపై సీఎం సంతృప్తి చెందలేదు. వారికి మరో డెడ్‌లైన్ పెట్టారు. అసలు ఆఫీసర్లు వాస్తవ లెక్కలే ఇచ్చారా? లేక తిమ్మిని బమ్మిని చేయాలని చూశారా? ఉద్యోగ ఖాళీల లెక్కలను అధికారులు సరిచూసుకున్నారు గత డిసెంబర్‌లోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించారు తెలంగాణ సీఎం కేసీఆర్. వెంటనే ఖాళీలను గుర్తించి నియామక ప్రక్రియ చేపట్టాలని […]
మొదటి సారిగా ప్రెస్ మీట్ నిర్వహించిన వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ గడ్డపై కొత్త పార్టీ స్థాపించామని… వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ వ్యతిరేకి అవునా, కాదా అనేది గ్రామాల్లో తెలుసుకోవాలన్నారు. వైఎస్సార్ తెలంగాణకు వ్యతిరేకి కాదని… ప్రత్యేక తెలంగాణ అవసరం అని 41 మంది ఎమ్మెల్యేలతో కలిసి చెప్పారని గుర్తు చేసిన షర్మిల…యూపీఏ మ్యానిఫెస్టోలో కూడా తెలంగాణ ఏర్పాటు అంశం చేర్చారని తెలిపారు. మేము తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పలేదని…ఇది నా గడ్డ.. దీనికి […]
అన్న ఎమ్మెల్యే.. పెత్తనం తమ్ముడిది. అక్కడ ఎవరికైనా సరే.. తమ్ముడి మాటే వేదం. దీంతో తమ్ముడి కుమ్ముడి గురించి కథలు కథలుగా చెప్పుకొంటున్నారు జనం. ఇదే ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్. వారెవరో ఈ స్టోరీలో చూద్దాం. నందిగామలో ఎమ్మెల్యే తమ్ముడి తీరుపై చర్చ! 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీ ఖాతాలో పడిన నియోజకవర్గాల్లో కృష్ణాజిల్లా నందిగామ ఒకటి. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఓడిన మొండితోక జగన్మోహనే 2019లో గెలిచి అసెంబ్లీలో […]
సైకిల్ దిగి కారెక్కిన ఎల్ రమణ లోడ్ ఎత్తాలా? ఆయనకు ఎలాంటి పదవీ యోగం ఉంది? ఈటల ఎగ్జిట్ తర్వాత రమణకు రెడ్‌కార్పెట్ పరిచిన టీఆర్ఎస్.. కేబినెట్‌లోకి తీసుకుంటుందా? ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఆయనకు ఇచ్చిన మాటేంటి? ఈటల ఎపిసోడ్ తర్వాత పెరిగిన ప్రాధాన్యం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉంటూ.. ఆ పదవికి రాజీనామా చేసి.. టీఆర్‌ఎస్‌లో చేరిన ఎల్ రమణకు అధికారపార్టీలో లభించే ప్రాధాన్యం ఏంటి? మారిన రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఆయనకు కలిసి […]
కేంద్ర గెజిట్ పై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది తెలంగాణ ప్రభుత్వం. పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో చర్చలు కూడా జరుపుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్ కు సీఎం కెసిఆర్ రానున్నారు. ఈ సందర్బంగా కేంద్ర గెజిట్ పై కేసీఆర్ స్పందించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా… కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల […]
టీటీడీపీని వీడిన ఎల్ .రమణ .. ఇవాళ టీఆరెస్ తీర్ధం పుచ్చుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆయన… తన అనుచరులతో కలిసి.. గులాబీ కండువా కప్పుకుంటారు. చేరికల కోసం తెలంగాణ భవన్‌లో నేడు ప్రత్యేక కార్యక్రమం జరగబోతోంది. కొద్ది రోజుల క్రితం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా రమణ పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో బలమైన బీసీ నేత కోసం .. టిఆర్ఎస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. […]