దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నామస్మరణతో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. వైఎస్ఆర్ మావాడంటే.. మావాడంటూ నేతలు పోటీపడుతున్నారు. ఇదికాస్తా శృతిమించుతుండటంతో అందరిబంధువైన వైఎస్ఆర్ ఇప్పుడు కొందరివాడుగా మిగిలిపోతున్నాడు. నిన్న హైదరాబాద్లో వైఎస్ విజయమ్మ నిర్వహించిన వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనంగా సాక్షిగా ఈ విషయం రుజువైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనందరినీ విడిచి 12ఏళ్లు గడుస్తుంది. నిన్ననే ఆయన 12వర్ధంతిని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు నిరాడంబరంగా జరుపుకున్నారు. ఇడుపుపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ […]
ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ లతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యం లోనే సీఎం కేసీఆర్ తన ఢిల్లీ పర్యటన ను మరో రెండు రోజుల పొడిగించుకున్నారు. గోదావరి, కృష్ణానదీ జలాల వ్యవహారం, కేంద్ర గెజిట్ పై ప్రధాని మోడీ మరియు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ లతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. అలాగే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల పై ప్రధాని […]
కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలం కొత్త బసాపురం లో నాగయ్య – నాగమ్మ అనే దంపతులను దారుణంగా హత్య చేశారు. తెల్లవారు జామున వారు ఇంట్లో నిద్రి స్తుండగా హత్యకు పాల్పడ్డాడు హంతకుడు వీరయ్య. అయితే…ఈ ఘటన లో మృతి చెందిన వారికి నిందితుడు వీరయ్య కొడుకు వరుస అవుతాడని తెలుస్తోంది. మానసిక పరిస్థితి సరిగా లేక పెద్దమ్మ నాగమ్మ, పెద్దనాన్న నాగయ్య లను హత్య చేసినట్లు స్థానికులు […]
మూడురోజుల పర్యటన కోసం సీఎం కేసీఆర్.. ఢిల్లీ చేరుకున్నారు. రేపు హస్తినలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేయనున్నారు కేసీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. రేపు మధ్యాహ్నం 1.48గంటలకు ఢిల్లీ వసంత్ విహార్‌లో.. టీఆర్‌ఎస్‌కు కేంద్రం కేటాయించిన స్థలంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న మంత్రులు.. నిర్మాణ స్థలంలో భూమిపూజ ఏర్పాట్లను పరిశీలించారు. ఢిల్లీలోని వసంత్ విహారం మెట్రో స్టేషన్ పక్కన.. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో గురువారం ఈడీ ఎదుట నటి చార్మీ హాజరుకానుంది. ఇప్పటికే చార్మికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. చార్మీ గురించి ఈడీకి కెల్విన్ ఎలాంటి విషయాలు అందజేశాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఈడీ చార్మి బ్యాంకు అకౌంట్లను కూడా పరిశీలించనున్నారు. చార్మికి చెందిన ప్రొడక్షన్ హౌస్‌కు సంబంధించిన లావాదేవీలపై కూడా ఈడీ ఆరా తీయబోతోంది. పూరీ జగన్నాధ్‌తో కలిసి సినిమా నిర్మాణంలోకి వచ్చింది చార్మ. కెల్విన్ అకౌంట్లోకి చార్మి పెద్దమొత్తంలో నగదు బదిలీ చేసినట్లు […]
అగ్రదేశం అమెరికాను కొత్త సమస్య వేధిస్తోంది. డెల్టా వేరియంట్ విజృంభణతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ఆ దేశంలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. మరీ ముఖ్యంగా దక్షిణ అమెరికాలో సమస్యను ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఫ్లొరిడా, సౌత్ కరోలినా, టెక్సాస్, లూసియానాలోని ఆసుపత్రుల్లో ఈ కొరత తీవ్రంగా ఉందని అక్కడి వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల రిజర్వ్ చేసిన ఆక్సిజన్ వాడాల్సి వస్తుండగా… మరికొన్ని చోట్ల పూర్తిగా నిండుకునే పరిస్థితి ఉందని చెప్పారు. ‘సాధారణంగా […]
మాజీ మంత్రి కుమారుడు ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి తప్పలేదు. ఓడాక.. పార్టీని, కేడర్‌ను ఆయన పట్టించుకోవడం లేదట. పైగా అధికారపక్షానికి దగ్గరవుతున్నారని గుర్రుగా ఉన్నారట తెలుగు తమ్ముళ్లు. ఇంకేముందీ.. ఆయన్ని పక్కన పెట్టేయాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. ఆ రగడేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఓటమి తర్వాత హరికృష్ణ కనిపించలేదని కేడర్ ఆరోపణ! చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు. ఈ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. నాయకత్వ లేమి కారణంగా ఇక్కడ పార్టీకి ఓటమి […]
ఆహ్వానాలు వెళ్లాయి సరే..! సెప్టెంబర్ 2నాటి YSR సంస్మరణ సభకు తెలంగాణ నుంచి హాజరయ్యేది ఎవరు? ఎంత మంది వెళ్తారు? మారిన రాజకీయ వాతావరణంలో నీడను కూడా నమ్మలేని స్థితిలో ఉన్న నాయకులు.. ఆహ్వానాన్ని మన్నిస్తారా? ఆహ్వానాలు అందుకున్న తెలంగాణ నేతలు తేల్చుకోలేకపోతున్నారా? సెప్టెంబర్ 2. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఈ తేదీపైనే ఎక్కువ మంది ఫోకస్ పెట్టారు. ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్థంతి కావడంతో.. ఆ రోజున హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన […]
ఢిల్లీ : కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అటవీ పర్యావరణ, కార్మిక శాఖల మంత్రి భూపేంద్ర యాదవ్ లను తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కలిశారు. రాష్ట్ర కార్మిక మంత్రిత్వ శాఖ కు స్కిల్ డెవలప్ మెంట్ కింద కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు విజ్ఞప్తి చేశారు మంత్రి మల్లారెడ్డి. నాచారంలో ఉన్న 350 బెడ్ల ఈఎస్ఐ హాస్పటల్ నిర్మాణం త్వరగా […]