పీసీసీ అధ్యక్ష పదవి నిర్ణయాన్ని బట్టి.. మంత్రివర్గ విస్తరణలో సామాజిక కూర్పులు ఆధారపడి ఉంటుందని పేర్కొన్నట్లు తెలుస్తుంది. రెండు మూడు రోజుల్లో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక చేసిన అనంతరం మంత్రి పదవులకు పేర్లు ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ (శనివారం) రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఉదయం 11 గంటలకు ఆయన మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లబోతున్నారు.
TPCC Chief Post: ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతుంది. ఈ మీటింగ్ లో తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడు నియామకం, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
KVP Ramachandra Rao: అసెంబ్లీ ముందున్న టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహా ప్రదాత టంగుటూరి ప్రకాశం పంతులు అని అన్నారు. పురాణాల్లో కర్ణుడి గురించి విన్నాం.. ఈ తరంలో ప్రకాశం పంతులు గురించి విన్నామన్నారు.
Doctors Negligence: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో అశ్విని అనే మహిళ కుర్చీలోనే డెలివరీ అయింది. ఈరోజు తెల్లవారు జామున ఘటన చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో వచ్చిన మహిళను ఆస్పత్రిలో చేర్చుకోవడానికి వైద్య సిబ్బంది నిరాకరించింది.
Big Scam: ఇందు గలడు అందు లేదు.. ఎందెందు వెతికిన అవినీతి, అక్రమాలు అన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి.. కొమురం భీం జిల్లాలో విచిత్ర మాయాజాలం బయట పడింది. సచ్చినోళ్ల పేరు చెప్పి అధికారులు రుణమాఫీ పేరుతో పెద్ద స్కామ్ చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది.
బాలాపూర్ లో బీటెక్ విద్యార్థి ప్రశాంత్ ను స్నేహితులే హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. బాలాపూర్ చౌరస్తా హోటల్ 37 దగ్గర ప్రశాంత్ ముగ్గురు స్నేహితులు కత్తితో పొడిచి హత్య చేశారు..
Online Betting: ఆదిలాబాద్ జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్లో నష్టపోయిన ఓ ప్రైవేట్ టీచర్ అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. జిల్లా కేంద్రంలోని ఎరోడ్రం సమీపంలో ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Congress Key Meeting: తెలంగాణ పీసీసీ అధ్యక్ష ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై కసరత్తు కొనసాగుతుంది. ఇందులో భాగంగానే ఇవాళ ( శుక్రవారం ) ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కీలక సమావేశం జరగనుంది.