Polygraph Test: కోల్కతాలో ఆర్జీ కార్ హస్పటల్ జూనియర్ డాక్టర్ ని హత్యాచారం చేసిన కేసులో.. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి ఆదివారం పాలీగ్రాఫ్ టెస్ట్ చేశారు. కోల్కతా పోలీసు శాఖలో సివిల్ వాలంటీర్గా అతను వర్క్ చేస్తున్నాడు. అయితే, సీబీఐకి ఇచ్చిన లై డిటెక్టర్ పరీక్షలో నిందితుడు సంజయ్ కొన్ని కీలక అంశాలు వెల్లడించినట్లు తెలుస్తుంది.
Paravada: అనకాపల్లి జిల్లా పరవాడపరవాడ సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది.. ఇప్పటి వరకు ముగ్గురు మరణించారు. విజయనగరం జిల్లాకు చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ ఇవాళ (సోమవారం) తెల్లవారు జామున మృతి చెందారు.
Wife Kills Husband: కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన ఈ ఘటన సిద్దవటం మండలం లింగంపల్లి గ్రామంలో జరిగింది. అయితే, రాయచోటి ఘాటులో పూర్తిగా పురుగులు పడిన గంగయ్య మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు..
CM Chandrababu: శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆశీస్సులు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను అని ఎక్స్ ( ట్విట్టర్ ) వేదికగా పోస్ట్ చేశారు.
Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వ దర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి బయట టీబీసీ వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) అధికారులు పేర్కొన్నారు.
Army Recruitment Rally: నేటి నుంచి అగ్నివీర్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం పోర్టు స్టేడియంలో భారీ ఆర్మీ ర్యాలీలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ వరకూ జరిగే ఈ నియామక ప్రక్రియలో వివిధ రకాల పరీక్షలు పెట్టే అవకాశం ఉంది. పదో తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులతో పాటు 8వ తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ ట్రేడ్ మ్యాన్ పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు. పోర్టు […]
Rain Alert: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
Anakapalli Dist: అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇంటి ఇలవేల్పు ఆలయంలో బంగారు ఆభరణాలు మాయం అయ్యాయి. మరిడి మహా లక్ష్మీ అమ్మవారి బంగారు హారం స్థానంలో గిల్టు నగను దేవాదాయశాఖ అధికారులు గుర్తించారు.