ఇటీవలే టిటిడి చైర్మన్ పదవి బాధ్యతలను.. వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డికి జగన్ సర్కార్ అప్పగించిన సంగతి తెలిసిందే. మొన్నటి నామినేటెడ్ పదవుల్లో భాగంగా… వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి దక్కింది. అయితే.. ఈ నేపథ్యంలోనే ఇవాళ టిటిడి చైర్మన్ గా భాధ్యతలు స్వీకరించనున్నారు వైవి సుబ్బారెడ్డి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు టీటీడీ అధికారులు. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. దీంతో దీంతో రెండోసారి టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు వైవీ సుబ్బారెడ్డి. కాగా… తిరుమలలో నిన్న 19839 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా..9153 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం 1.57 కోట్లకు చేరుకుంది.