YV Subbareddy: జూన్ 18 నుంచి జూలై 9 వరకూ అమెరికాలో కళ్యాణోత్సవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలోని శ్రీవారి భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమెరికాలో వున్న తెలుగు వారి కోసం ఈ నెల 18 వ తేదీ నుంచి జూలై 9తేది వరకు కళ్యాణోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. 7 నగరాలలో కళ్యాణోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
నాటా ఆధ్వర్యంలో కళ్యాణోత్సవ కార్యక్రమాలకు భక్తులను ఉచితంగా అనుమతిస్తాం అనీ, భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారని భావిస్తున్నామన్నారు. కళ్యాణోత్సవ కార్యక్రమాలకు విగ్రహాలను తిరుమల నుంచి తీసుకువెళ్లి..తిరుమల తరహలోనే కళ్యాణోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. త్వరలోనే యూకే,దుబాయ్ వంటి దేశాలలో కూడా కళ్యాణోత్సవ కార్యక్రమాలను నిర్వహించేందుకు యోచిస్తున్నామన్నారు. ఇటీవల ఢిల్లీలో టీటీడీ కళ్యాణోత్సవాలు నిర్వహించగా, రాజకీయ ప్రముఖులతో పాటు ఆధ్యాత్మిక వేత్తలు, సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Also Read
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
- Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
- Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
టీటీడీ ఉద్యోగులపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం అన్నారు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. వేసవి రద్దీ తగ్గిన తరువాత సర్వదర్శన భక్తులకు టోకెన్లు జారీచేస్తామన్నారు. రేపటి నుంచి శ్రీవారి వార్షిక జ్యేష్టాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. రేపు వజ్రకవచం ధరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. ఎల్లుండి ముత్యపు కవచంలో, చివరి రోజున స్వర్ణ కవచంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి. ఇవాళ తిరుమలలో కరెంట్ బుకింగ్ విధానంలో జ్యేష్టాభిషేకం టిక్కెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ. వేసవి సెలవులు చివరి దశకు చేరడంతో భక్తుల రద్దీ విపరీతంగా వుంది. దర్శనానికి గంటల తరబడి వేచి వుండాల్సి వస్తోంది.
తాజావార్తలు
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్‌మెన్‌గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..