Site icon NTV Telugu

YV Subba Reddy: తిరుమల లడ్డూపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వైవీ సుబ్బారెడ్డి

Yv

Yv

YV Subba Reddy: తిరుమల లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తాను.. విచారణ సరిగ్గా జరిగితే ఎప్పుడైనా హాజరుకావడానికి సిద్ధమే అన్నారు. శాస్త్రీయ ఆధారాలతో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ల్యాబ్ నివేదికలు రాక ముందే మీడియా లీకులు, రాజకీయ ప్రచారాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. అసత్యాలు, వదంతులతో భక్తుల విశ్వాసాలను దెబ్బ తీయొద్దని కోరారు. చంద్రబాబే మొదటగా లడ్డూలో జంతు కొవ్వు వాడారంటూ నిరాధార ఆరోపణలు చేశారు.. అప్పుడు సుప్రీం కోర్టును టీటీడీ ఆశ్రయించింది అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

Read Also: Alluri District : అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మొత్తం అలెర్ట్‌!

అయితే, సీబీఐ ఆధ్వర్యంలో సెట్ విచారణకు కోర్టు ఆదేశించిందని మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సిట్ విచారణ పూర్తి కాక ముందే మళ్లీ అవే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దీని వలన భక్తుల మనోభావాలు దెబ్బ తింటున్నాయి.. ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు.. మొదట విజిటబుల్ ఫ్యాట్ కలిసిందన్నారు.. ఆ తర్వాత జంతువుల కొవ్వు కలిసింది అన్నారు.. ల్యాబ్ నివేదికలు రాక ముందే ఇలాంటి నిర్ణయానికి ఎలా వస్తారు? అని ప్రశ్నించారు. సిట్ అధికారులు ల్యాబ్ నివేదికల ఆధారంగా మాత్రమే వాస్తవాలను ప్రకటించాలని వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

Read Also: Ramanaidu Studios : GHMC నోటీసులపై స్పందించిన రామానాయుడు స్టూడియోస్?

ఇక, మా ప్రభుత్వ హయాంలో రూ. 326ల చొప్పున నెయ్యి కొనుగోలు చేశామని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. అందులో కల్తీ జరిగి ఉంటే.. మరి చంద్రబాబు హయాంలో అతి తక్కువ ధర రూ. 274, రూ.276, రూ.279లకే కొనుగోలు చేశారు.. మరి అందులో కూడా కల్తీ జరిగినట్లు అంగీకరిస్తారా? అని అడిగారు. ధర ఆధారంగా కల్తీ ఆరోపణలు చేయడం సబబు కాదు.. వైసీపీని రాజకీయంగా దెబ్బ తీయటానికి తిరుమల పవిత్రతను వాడుకోవద్దు అని కోరారు. మీడియా సంస్థలు తప్పుడు కథనాలను ప్రసారం చేయొద్దు.. భక్తుల మనోభావాలను దెబ్బ తీయవద్దు అని మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలియజేశారు.

Exit mobile version