ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉదయగిరి ఎం.ఎల్.ఏ. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కార్యాలయంలో వైసీపీ ఫ్లెక్సీలు కనిపించకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన అనుచరులు కూడా అందుబాటులో లేరు. శాసనసభలో కనిపించని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపైన చర్చ సాగుతోంది. క్రాస్ ఓటింగ్ వేసిన ఎమ్మెల్యేల గురించి లాబీల్లో తీవ్ర చర్చ సాగుతోంది. మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇవాళ ఇప్పటి వరకు హాజరు కాని ఈ ఇద్దరు సభ్యులు ఎక్కడికెళ్ళారనేది వైసీపీ వర్గాలను కుదిపేస్తోంది. ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే బెంగళూరు వెళ్ళి పోయారు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి.
ఆయన ఎక్కడున్నారోనని తెలుసుకునేందుకు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉంది.ఇటీవల ఆయన స్వల్ప అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం సీఎం జగన్ ను కలసినప్పుడు ఈసారి టిక్కెట్ ఇవ్వలేనని, ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ చెప్పడంతోనే ఆయన క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని చెబుతున్నారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనపై నమ్మకంతోనే జగన్ ఈ మాట చెప్పారంటున్నారు.దీంతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఓటింగ్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న అనుమానాలు కలుగుతున్నాయి.
Read Also: Viral Video: టేకాఫ్ అయిన వెంటనే ఆగిన ఇంజన్.. ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం..
ఇదిలా ఉంటే వైసీపీ అధిష్టానంపై అసహనంతో ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీకి ఓటేశారంటున్నారు. టీడీపీ తనకున్న 23 మందిలో 19 ఓట్లు గ్యారంటీగా పడతాయని, వైసీపీలోని అసంతృప్త ఎమ్మెల్యేలు ఇద్దరు తమకే ఓటేస్తారని టీడీపీ భావించింది. 21 ఓట్లు గ్యారెంటీగా పడే అవకాశముందని పోటీకి దిగింది. వైసీపీలోని అసంతృప్త ఎమ్మెల్యేల్లో మరొక్కరు ఓటు వేస్తే గెలుపు ఖాయమని అనుకుంది. ఊహించని విధంగా రెండు అదనపు ఓట్లు పడ్డాయి. దీంతో ‘ఆ ఇద్దరు ఎవరు?’ అనే దిశగా సర్వత్రా చర్చ జరుగుతోంది. కొంతకాలంగా వైసీపీ అధిష్ఠానంపై గుర్రుగా ఉన్న ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితోపాటు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేరునూ వైసీపీ నేతలు ప్రచారంలోకి తెచ్చారు. వీరిపై చర్యలు తప్పవంటోంది వైసీపీ. మంత్రుల నోట అదేమాట వినిపిస్తోంది.
Read Also: Rishi Sunak : ఇంగ్లండ్ క్రికెటర్ వలలో బ్రిటన్ ప్రధాని.. అంతా అతని వల్లే..?