వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని కీలక పదవి వరించింది.. పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా మరోసారి ఎన్నికయ్యారు సాయిరెడ్డి.. వరుసగా రెండోసారి పీఏసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు విజయసాయిరెడ్డి.. కేంద్ర ప్రభుత్వ ఆదాయ వ్యయ ఖాతాలను పరిశీలించడం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పని.. ఇక, సాయిరెడ్డిని మరోసారి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా నియమించినట్టు పార్లమెంట్ బులిటెన్ విడుదల చేశారు. మరోవైపు.. తన నియామకంపై ఆనందం వ్యక్తం చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషికి ధన్యవాదాలు తెలిపారు. గత ఏడాది ఆగస్టు 10వ తేదీన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని పీఏసీ సభ్యుడిగా నియమించిన కేంద్రం.. మరోసారి.. అంటే, డిసెంబర్ 13వ తేదీన రెండో సారి ఆయనకు ఆ పదవి కట్టబెట్టింది.