Site icon NTV Telugu

Vijayasai Reddy: తారకరత్నను పరామర్శించిన విజయసాయిరెడ్డి.. బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు..

Vijayasai Reddy

Vijayasai Reddy

YSRCP MP Vijayasai Reddy Visits Taraka Ratna: నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను పరామర్శించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ఇవాళ బెంగళూరు వెళ్లిన ఆయన.. ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శించారు.. వైద్యులను అడిగి.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.. 45 నిమిషాలు గుండె ఆగిపోవడం వలన మెదడులో పైభాగం దెబ్బతింది.. దానివలన మెదడులో నీరు చేరి మెదడు వాచినట్టు తెలిపారు.. అయితే, వాపు తగ్గిన వెంటనే బ్రెయిన్ రికవరీ అవుతుందని డాక్టర్లు చెప్పినట్టు సాయిరెడ్డి వివరించారు..

Read Also: Nandamuri Balakrishna: తారకరత్న చెవిలో బాలయ్య ‘మృత్యుంజయ మంత్రం’!

మరోవైపు నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు విజయసాయిరెడ్డి.. బాలకృష్ణ దగ్గరుండి తారకరత్నకు అన్ని వైద్యసదుపాయాలు కల్పించారని తెలిపిన ఆయన.. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.. ఇక, మెదడుపై భాగం దెబ్బతినడంతో కొన్ని అవయవాలు కొంత యాక్టీవ్ గా పనిచేయడంలేదని డాక్టర్లు తెలిపారని.. గుండె బాగానే పనిచేస్తుందని.. తారకరత్న త్వరలోనే కోలుకుంటారని వెల్లడించారు విజయసాయిరెడ్డి. కాగా, తారకరత్నకు విజయసాయిరెడ్డి స్వయానా మామ అవుతారనే విషయం విదితమే.. తారకరత్న 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు.. నందీశ్వరుడు చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా అలేఖ్య రెడ్డి పని చేయగా.. ఆ సమయంలో అలేఖ్య-తారకరత్న మధ్య ప్రేమ చిగురించింది.. అయితే, అలేఖ్యతో వివాహానికి తారకరత్న పేరెంట్స్ ఒప్పుకోలేదట. దీంతో ఆయన గుడిలో స్నేహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొన్నాళ్ల తర్వాత పేరెంట్స్ తారకరత్న-అలేఖ్యలను దగ్గరకు తీసుకున్నారు. తారకరత్న భార్య అలేఖ్యకు విజయసాయిరెడ్డి పెదనాన్న వరస అవుతారు. విజయసాయిరెడ్డి భార్య సునంద చెల్లెలు కూతురే అలేఖ్య.. కాబట్టి విజయసాయిరెడ్డి భార్య అలేఖ్యకు సొంత పెద్దమ్మ అవుతారన్నమాట. మొత్తంగా ఆ విధంగా విజయసాయిరెడ్డి.. నందమూరి కుటుంబానికి బంధువు అయ్యాడు.

Exit mobile version