Site icon NTV Telugu

అశోక్ గజపతిరాజుపై సాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

Vijaya Sai Reddy

Vijaya Sai Reddy

మాన్సాస్ ట్రస్ట్, ఇతర విషయాల్లో టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు, ఏపీ ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తూనే ఉంది… ఇక, మరోసారి అశోక్‌ గజపతిరాజుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. సంచయిత గజపతిపై అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు చాలా అనాగరికం… అలాంటి అనాగరికుడుని రాజుగా ఎలా గుర్తిస్తామన్న ఆయన.. కూలింగ్ గ్లాసులలో లోకాన్ని చూసే వాడు ప్రజా సమస్యలు ఎలా తెలుసు కుంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పుణ్యమా అంటూ ఎమ్మెల్యే, మంత్రిగా అశోక్ గజపతిరాజు చలామణి అయ్యారన్న సాయిరెడ్డి.. సింహాచలం దేవస్థానంలో 10 వేల కోట్లు రూపాయల విలువైన 830 ఎకరాల భూముల లెక్కలు మాయం అయ్యాయని ఆరోపించారు.. దేవుడు సొమ్ము తిన్నవారు ఎవరైనా ఇబ్బందులు తప్పవని… చట్టాన్ని వ్యతిరేకించిన అందరికి శిక్ష తప్పదని హెచ్చరించారు.

భూముల రికార్డులు తారుమారు చేశారు.. రాజులైతే చట్టానికి అతీతులా..? అని ప్రశ్నించారు సాయిరెడ్డి.. ఇది ప్రజాస్వామ్యమా…? లేక అశోక్ స్వామ్యమా…? అని నిలదీసిన ఆయన.. గతంలో ఈవోగా పని చేసిన రామచంద్రమోహన్ హయామంలో 830 ఎకరాలు దేవస్థానం భూమి రికార్డులు తారుమారు చేశారని.. కిందిస్థాయి అధికారి ఎవ్వరి అనుమతి లేకుండా పదివేలకోట్లు రూపాయలు అవినితికి పాల్పాడ్డారని విమర్శించారు.. ఇక, మహిళ కమిషన్ కు సంచాయిత ఫిర్యాదు చేశారని.. మాన్సాస్ ట్రస్ట్ బైలానే కారణం అయితే.. దాని సమీక్షిస్తామన్నారు.. కాగా, సింహాచలం భూముల అక్రమాలపై చర్యలు తీసుకున్న అధికారులు.. గతంలో ఈవోగా పనిచేసిన రామచంద్రమోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్‌ చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version