అశోక్ గజపతిరాజుపై సాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాన్సాస్ ట్రస్ట్, ఇతర విషయాల్లో టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, ఏపీ ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తూనే ఉంది… ఇక, మరోసారి అశోక్ గజపతిరాజుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. సంచయిత గజపతిపై అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు చాలా అనాగరికం… అలాంటి అనాగరికుడుని రాజుగా ఎలా గుర్తిస్తామన్న ఆయన.. కూలింగ్ గ్లాసులలో లోకాన్ని చూసే వాడు ప్రజా సమస్యలు ఎలా తెలుసు కుంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పుణ్యమా అంటూ ఎమ్మెల్యే, మంత్రిగా అశోక్ గజపతిరాజు చలామణి అయ్యారన్న సాయిరెడ్డి.. సింహాచలం దేవస్థానంలో 10 వేల కోట్లు రూపాయల విలువైన 830 ఎకరాల భూముల లెక్కలు మాయం అయ్యాయని ఆరోపించారు.. దేవుడు సొమ్ము తిన్నవారు ఎవరైనా ఇబ్బందులు తప్పవని… చట్టాన్ని వ్యతిరేకించిన అందరికి శిక్ష తప్పదని హెచ్చరించారు.
భూముల రికార్డులు తారుమారు చేశారు.. రాజులైతే చట్టానికి అతీతులా..? అని ప్రశ్నించారు సాయిరెడ్డి.. ఇది ప్రజాస్వామ్యమా…? లేక అశోక్ స్వామ్యమా…? అని నిలదీసిన ఆయన.. గతంలో ఈవోగా పని చేసిన రామచంద్రమోహన్ హయామంలో 830 ఎకరాలు దేవస్థానం భూమి రికార్డులు తారుమారు చేశారని.. కిందిస్థాయి అధికారి ఎవ్వరి అనుమతి లేకుండా పదివేలకోట్లు రూపాయలు అవినితికి పాల్పాడ్డారని విమర్శించారు.. ఇక, మహిళ కమిషన్ కు సంచాయిత ఫిర్యాదు చేశారని.. మాన్సాస్ ట్రస్ట్ బైలానే కారణం అయితే.. దాని సమీక్షిస్తామన్నారు.. కాగా, సింహాచలం భూముల అక్రమాలపై చర్యలు తీసుకున్న అధికారులు.. గతంలో ఈవోగా పనిచేసిన రామచంద్రమోహన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేసిన విషయం తెలిసిందే.
Also Read
- Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
- Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
తాజావార్తలు
-
Nagarjuna: కొడుకు సక్సెస్ కోసం నాగార్జున తపన.. ‘లెనిన్’ స్క్రిప్ట్‌లో కింగ్ రైటింగ్!
-
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం
-
Shravan Month Dreams: శ్రావణ మాసంలో మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ దరిద్రం తీరిపోయినట్లే! అవి ఏంటో తెలుసా?
-
TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
-
Jananayagan : విజయ్ లాస్ట్ మూవీతో కిరణ్‌కు తిప్పలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!