Site icon NTV Telugu

Eliza and Kambala Jogulu: టీడీపీ ఎమ్మెల్యేలపై అట్రాసిటీ కేసు పెట్టాలి..!

Eliza And Kambala Jogulu

Eliza And Kambala Jogulu

Eliza and Kambala Jogulu: అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనతో టీడీపీ ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు.. వైసీపీకి చెందిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా.. టీడీపీ-వైసీపీ ఎమ్మెల్యేల ఘర్షణపై స్పందించిన ఆయన.. సభ సజావుగా జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారు.. చంద్రబాబు డైరక్షన్ లోనే సభలో గలాటా చేస్తున్నారని విమర్శించారు. ఈ రోజు మితిమీరిపోయింది.. డోలా వీరాంజనేయులు స్పీకర్ పై దాడి చేశారని.. నేను అడ్డుకోవడానికి వెళ్తే నాపైనా దాడి చేశారని.. సుధాకర్ బాబు కూడా అడ్డుకోబోతే ఆయనపైనా దాడి చేశారని.. సభాపతిని టీడీపీ వాళ్లు అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. బీసీ అయిన సభాపతిని కాపాడుకోవడానికి వెళ్లాం.. దీంతో మాపై కూడా దాడి చేశారు.. టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు పెట్టాలని కోరారు ఎమ్మెల్యే ఎలిజా.

Read Also: Deputy CM Narayana Swamy: స్పీకర్ మీద చేయివేశారు.. కాపాడటానికే ఎమ్మెల్యేలు వెళ్లారు..!

ఇక, అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ప్రవర్తన చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. అసెంబ్లీలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీ నేతలు భారతంలో శిఖండిలా వ్యవహరిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలుచేశారు. ఒక ఎస్సీ ఎమ్మెల్యేను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. స్పీకర్ తమ్మినేని సీతారంపై దాడి చేయడం చాలా దుర్మార్గం అని ఫైర్‌ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు.

Exit mobile version