NTV Telugu Site icon

తెలుగుదేశం పార్టీ.. తెలుగు దొంగల పార్టీగా మారింది..!

Vasantha Krishna Prasad

Vasantha Krishna Prasad

టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్… ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం పార్టీ.. తెలుగు దొంగల పార్టీగా మారింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. కొండపల్లి మైనింగ్ పై తెదేపా నేత పట్టాభి ఆరోపణలను ఖండించిన ఆయన.. అబద్దాలను నిజం చేయాలని తెదేపా నేతలు, పట్టాభి ప్రయత్నాలు చేస్తున్నారని.. లోయ గ్రామంలో లేని 143 సర్వే నెంబర్ ను వైఎస్ హయాంలో సృష్టించారని పట్టాభి ఆరోపించారని.. 1993లో ఒక వ్యక్తి దరఖాస్తు చేసుకోగా 143 సర్వే నెంబర్ పై లీజును మైనింగ్ శాఖ అధికారులు మంజూరు చేశారని.. 1943-44లో రూపొందించిన ఆర్ఎస్ఆర్ రికార్డులోనూ 143 సర్వే నెంబర్ ఉంది..143 సర్వే నెంబర్ ఎప్పట్నుంచో ఉందనడానికి ఆధారాలు ఉన్నాయన్నారు.

వైఎస్ హయాంలో 143 సర్వే నెంబర్ ను సృష్టించారని పట్టాభి ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు వసంత కృష్ణప్రసాద్.. 45 ఏళ్లుగా ఆ ప్రాంతంలో మైనింగ్ జరుగుతోంది… అక్కడ అన్ని సదుపాయాలు కల్పించారు.. నా పై బురదజల్లడమే లక్ష్యంగా దేవినేని ఉమా.. ఏడాదిన్నరగా పనిచేస్తున్నారని మండిపడ్డారు.. నేను పదో తరగతి వరకే చదివానని పట్టాభి అంటున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్ లోనూ నేను స్పష్టం చేశానన్న ఆయన.. ఎన్టీఆర్ పెట్టిన తెదేపాను లోకేష్ పునాదులతో సహా పెకలిస్తారని.. తెదేపా బ్రోకర్ల పార్టీగా తయారైంది అంటూ హాట్‌ కామెంట్లు చేశారు.. గ్రాఫిక్స్ లు చూసి అమెరికాలో ఉన్నవారూ అమరావతిలో కోట్లు పోసి నష్టపోయారని విమర్శించిన కృష్ణప్రసాద్.. రాజధాని అమరావతిలో రోడ్లను ప్రభుత్వమే తవ్విస్తుందనే ఆరోపణలను ఖండించారు.. రాజధానిలో రోడ్లను ఎక్కడైనా ప్రభుత్వం తవ్విస్తుందా? అని ప్రశ్నించారు.