YS Jagan: వైఎస్సార్ 77వ జయంతి.. ఇడుపులపాయలో నివాళులర్పించిన జగన్
- వైఎస్సార్ 77వ జయంతి..
- ఇడుపులపాయలో నివాళులర్పించిన వైఎస్ జగన్..
- కుటుంబ సభ్యులతో కలిసి జగన్ ప్రత్యేక ప్రార్థనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు కూడా వైఎస్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించగా, పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు, నివాళి సభలను ఏర్పాటు చేశాయి.
ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైఎస్ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం తన తండ్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి పాల్గొన్నారు. అలాగే వైఎస్సార్సీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వైఎస్సార్‌కు నివాళులర్పించారు.
Also Read
రాష్ట్రవ్యాప్తంగా జయంతి వేడుకలు
వైఎస్సార్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పార్టీ నాయకులు రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, మొక్కల నాటకం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ ప్రజా సంక్షేమానికి చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు నాయకులు గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. మరోవైపు.. ఇతర పార్టీల నేతలు కూడా వైఎస్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నారు..
తాజావార్తలు
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
-
OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!