Vontimitta: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శేషవాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల వాహనసేవ వైభవంగా సాగింది.. ఇక, ఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంత్రుల బృందం పరిశీలించనుంది.. ఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణ మహోత్సవం కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ నెల 11వ తేదీన సీఎం చంద్రబాబు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.. ఈ నేపథ్యంలో కళ్యాణ ఏర్పాట్ల పరిశీలనకు మంత్రుల బృందం నేడు ఒంటిమిట్టల రానుంది.. ఆలయం వద్ద ఏర్పాట్లను సమీక్షించనుంది మంత్రుల బృందం.. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం పర్యటన కొనసాగడనుండగా.. ఏర్పాట్లు పరిశీలనకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హాజరుకానున్నారు.. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.. మంత్రుల బృందానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..
Read Also: Maheshwaram: మహేశ్వరంలో సంచలనం.. యాక్సిడెంట్ ముసుగులో హత్య
కాగా, కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన ఆదివారం రాత్రి శేషవాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారు భక్తులను కటాక్షించారు. రాత్రి గంటల నుండి భజన బృందాల కోలాటాల నడుమ పురవీధుల్లో వాహనసేవ జరిగింది. ఆదిశేషుడు స్వామివారికి మిక్కిలి సన్నిహితుడు. త్రేతాయుగంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శేషుడు అవతరించాడు. శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఇతడు ఆద్యుడు. భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. వాహన సేవలో ఆలయ డెప్యూటీ ఈవో నటేష్ బాబు, సూపరింటెం డెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నవీన్.. ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.