YSRCP: వైసీపీకి వరుస షాక్‌లు.. టీడీపీలోకి క్యూ కట్టిన కార్పొరేటర్లు..!
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటకు బీటలు..
- కడప కార్పొరేషన్ లో ఇప్పటికే టీడీపీలో చేరిన పలువురు కార్పొరేటర్లు..
- మరికొంత మంది కార్పొరేటర్లు వైసీపీకి గుడ్‌బై చెప్పేందుకు రెడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్లు కొందరు.. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు.. ప్రజాప్రతినిధులు ఇలా వరుసగా ఆ పార్టీకి షాక్ ఇస్తూ.. కూటమి పార్టీలో చేరుతున్నారు.. ఇప్పటికే చాలా మంది టీడీపీ కండువా కప్పుకోగా.. మరికొందరు జనసేన.. ఇంకా కొందరు బీజేపీలో చేరిపోయారు.. అయితే, వైసీపీ కంచుకోటకు కూడా బీటలు పడుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. కడప కార్పొరేషన్ లో పలువురు కార్పొరేటర్లు ఇప్పటికే వైసీపీకి గుడ్‌బై చెప్పగా.. మరికొందరు కూడా రెడీ ఉన్నారని తెలుస్తోంది.. కడప మున్సిపల్ కార్పొరేషన్ లోని కార్పొరేటర్లు మెల్లగా టీడీపీ గూటికి చేరుకుంటున్నారు.
Read Also: Maruti Suzuki Grand Vitara: మార్కెట్లోకి మరో మారుతీ 7-సీటర్.. లాంచ్ ఎప్పుడంటే?
Also Read
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
- YS Jagan: వైఎస్సార్ 77వ జయంతి.. ఇడుపులపాయలో నివాళులర్పించిన జగన్
- YS Jagan Pulivendula Visit: పులివెందులకు వైఎస్ జగన్.. నేడు ప్రజాదర్బార్, రేపు వైఎస్సార్‌కు నివాళి
50 డివిజన్లలో 49 వైసీపీ, ఒక్కస్థానంలో టీడీపీ దక్కించుకున్నాయి. అయితే, ప్రస్తుతం 47 స్థానాలు వైసీపీ చేతిలో ఉండగా ఇటీవల 25 డివిజన్ కార్పొరేటర్ సూర్య నారాయణ టిడిపిలో చేరారు. దీంతో టీడీపీ బలం రెండుకు చేరగా.. ఇప్పుడు దాదాపు 7 మందికి కార్పొరేటర్లు సైకిల్ ఎక్కారు. దీంతో టీడీపీ బలం తొమ్మిదికి చేరింది . అంతే కాదు.. దాదాపు 20 మంది వరకు చేరడానికి ముందుకు వచ్చినప్పటికీ టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి వారించినట్లు తెలుస్తోంది.. వీరిలో సగం మందిని మొదటి దశలో తీసుకుంటూ.. రెండో దశలో మిగిలిన వారిని తీసుకోవాలని భావిస్తున్నారట.. మొత్తంగా రెండో విడతలో చేరనున్న 11 మంది కార్పొరేటర్ల జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చేరినట్టుగా ప్రచారం సాగుతోంది.. సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను ఏడింటిని టిడిపి కైవసం చేసుకుంది. ఎన్నికల్లో పరాభవం అనంతరం మేల్కొంటూ పార్టీ బాధ్యతలు మేనమామ చేతిలో పెట్టారు వైసీపీ అధినేత. ఆ తర్వాత వచ్చిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో దాదాపు అన్ని స్థానాలను కూటమి బలపర్చిన అభ్యర్థులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. చివరకు పులివెందుల్లోనూ వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు కొత్తగా కడప కార్పొరేషన్ కూడా ఆ పార్టీకి తలనొప్పి తెచ్చిపెడుతొందట. ఇక్కడ కార్పొరేటర్ లు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతుండడం.. ఆ పార్టీకి మరింత ఇబ్బంది కరంగా మారిందంటున్నారు నేతలు..
తాజావార్తలు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!