YS Viveka Murder Case: రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం.. విజయవాడ, తిరుపతి నుంచి ఫోరెన్సిక్ నిపుణులు
- రంగన్న మృతి దేహానికి రీ పోస్టుమార్టం..
- విజయవాడ, తిరుపతి నుంచి ఫోరెన్సిక్ నిపుణులు
- కడప రిమ్స్ వైద్య బృందం ఆధ్వర్యంలో రీ పోస్టుమార్టం..
- పులివెందుల పోలీసులు.. ఆర్డీవో సమక్షంలో కార్యక్రమం పూర్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Viveka Murder Case: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సాక్షులు వరుసుగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వ్యాఖ్యానించారు.. వివేకా ఇంటి వాచ్‌మెన్‌గా పనిచేసే రంగన్న వివేకా హత్య కేసులు ప్రధాన సాక్షి అన్నారు. అయితే, కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ కేసు విచారణకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. సిట్ బృందంలో ఇద్దరు డీఎస్పీలతో పాటు, ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్ఐలు, పదిమంది కానిస్టేబుల్స్ ఉంటారని ఆయన వివరించారు.. రంగన్న మృతిని హై ప్రొఫైల్ మర్డర్ గా ఆయన పేర్కొన్నారు. మరింత లోతుగా విచారణ చేపట్టడం కోసం సిట్ బృందం ఆధ్వర్యంలో నిపుణుల చేత రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయించాలని నిర్ణయించారు. శనివారం కడప వైద్యులతో పాటు ఫోరెన్సిక్ నిపుణుచేత రంగన్న మృతి దేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు.
Also Read
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న మృతదేహానికి మరోసారి వైద్య బృందం పోస్ట్ మార్టం నిర్వహించారు. మూడు రోజుల క్రితం రంగన్న చికిత్స పొందుతూ అనారోగ్యంతో కడప రిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన మృతదేహానికి రిమ్స్ లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.. ఆ తర్వాత బంధువులు పులివెందుల బాకరాపురం స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, రంగన్న భార్య సుశీలమ్మ చేసిన ఆరోపణపైన సందేహాల నివృత్తి కోసం పోలీసులు రీపోస్టుమార్టం నిర్వహించారు. విజయవాడ, తిరుపతి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు, కడప రిమ్స్ వైద్య బృందం ఆధ్వర్యంలో పులివెందుల పోలీసులు.. పులివెందుల ఆర్డీవో సమక్షంలో మరోసారి పోస్టుమార్టం చేశారు. పూడ్చిపెట్టిన రంగన్న మృతదేహాన్ని వెలికి తీసి శరీరంపైన ఎక్కడైనా గాయాలు ఉన్నాయా? లేదా? అనే అంశంపై క్షుణ్ణంగా వైద్య బృందం పరిశీలించారు. మృతదేహం నుంచి తల వెంట్రుకలు, కాలిగోళ్లు, చేతి గోళ్లు మరికొన్ని అవయవాలు సేకరించారు. మృతదేహం నుంచి సేకరించిన అవయవాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు. పోస్టుమార్టం నిర్వహించే సమయంలో రంగన్న భార్య సుశీలమ్మ కూడా అక్కడే ఉన్నారు. ఈ పోస్టుమార్టం జరిగే ప్రాంతానికి 300 మీటర్ల దూరం నుంచి ఎవరిని లోపలికి రానీయకుండా పోలీసులు ఆంక్షలు విధించి రంగన్న మృతదేహానికి మరోసారి రీపోస్టుమార్టం నిర్వహించారు…
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!