అక్కడ అంతా మేడమ్ ఇష్టమేనా? నేను మోనార్క్‌ని.... గిల్లితే గిల్లించుకోవాలి, గిచ్చితే గిచ్చించుకోవాలని అంటున్నారా? పార్టీ నిర్ణయాలతో పని లేకుండా... తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా... నేను చెప్పిన వాళ్ళే కార్పొరేటర్స్ అవుతారని అంటున్న ఆ తెలుగుదేశం ఎమ్మెల్యే ఎవరు?
కడప ఎమ్మెల్యే మాధవి పీఏ వాహిద్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.. ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు.. డబ్బులు ఇస్తానంటూ నమ్మించి పెళ్లి చేసుకున్న వాహిద్.. ఆ తర్వాత వీడియోలు తీసి బ్లాక్ మెయిల్‌కు దిగాడు.
కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది.. మేయర్ సీటు పక్కన తనకు కుర్చీ వేయాలంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆందోళనకు దిగడంతో ఈ సమావేశం రణరంగంగా మారిపోయింది.. సమావేశాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేసినా పరిస్థితి కుదుటపడలేదు.. టీడీపీ సభ్యుల ఆందోళనలతో వైసీపీ సభ్యులు సమావేశాన్ని బాయికాట్ చేశారు..
కడపలో చెత్త వివాదం తారస్థాయికి చేరుకుంది.. గత రెండు రోజులుగా కడప ఎమ్మెల్యే మాధవి, కడప మేయర్ సురేష్ బాబుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం.. నేడు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తమ వీధులలో చెత్త ఎత్తలేదు అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చెత్తను తీసుకుని వచ్చి మేయర్ ఇంటి వద్ద వేసి నిరసనకు దిగారు.