Minister Nadendla: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో నేటి వరకు 2 లక్షల 36 వేల మెట్రిక్ టన్నులు సేకరించాం.. గత ఏడాదితో పోల్చితే 36 శాతం అదనంగా కొనుగోలు చేశాం.. గత ఏడాది ఈ సమయానికి లక్షా 81 వేల మెట్రిక్ టన్నులు సేకరించడం జరిగింది.. క్షేత్ర స్థాయిలో 16 వేల మంది సిబ్బంది పని చేస్తున్నారు.. గత ఏడాది 48 గంటల్లో రైతుల అకౌంట్లలో నగదు జమ చేస్తే, ఈ ఏడాది 24 గంటల్లోనే నగదు జమ చేస్తున్నాం.. ఇప్పటి వరకు 560 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం.. అలాగే, 32 వేల 793 మంది రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది అని మంత్రి నాదెండ్ల వెల్లడించారు.
Read Also: హెల్తీ లైఫ్‌కు బెస్ట్ ఫ్రెండ్! వాల్‌నట్స్ ఆశ్చర్యకర ఆరోగ్య ప్రయోజనాలు
ఇక, ఈ సారి 6 వేల 600 మంది కౌలు రైతుల నుంచి కూడా ధ్యానం కొనుగోలు చేశామని మంత్రి మనోహర్ పేర్కొన్నారు. రైతులకి ఇబ్బందులు కలగకుండా అవసరమైన రూ. 6 కోట్ల 34 లక్షల గన్ని బ్యాగ్స్ సిద్ధంగా ఉంచాం.. 32 వేల లారీలకు జీపీఎస్ అనుసంధానం చేసాం.. 50 వేల టార్పాలిలను సిద్ధం చేశాం.. ఇందులో 19 వేల టార్పాన్లను రైతు సేవ కేంద్రాల ద్వారా ఉచితంగా అందిస్తున్నాం.. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెట్టుకుందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు.