YS Jagan : చంద్రబాబు చేస్తున్నది ప్రజా వ్యతిరేక నిర్ణయం.. 12న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చంద్రబాబు చేస్తున్న దరిద్రపు పని
- స్కాములు చేస్తూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నాడు
- మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం
- పత్రి జిల్లాకో గవర్నమెంట్ కాలేజీ తీసుకొచ్చాం
- చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాలేదు
- ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసినా సరిపోయేది. -వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ విద్య రంగంపై సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం దరిద్రపు పని అని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ మాట్లాడుతూ.. “మూడేళ్లలో మేము 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. ప్రతి జిల్లాలో గవర్నమెంట్ కాలేజీలు ఏర్పరిచాం. కానీ చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు. ఇప్పుడు వాటిని ప్రైవేట్ వారికి అప్పగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు చేసి అయినా ప్రజల ఆరోగ్య భవిష్యత్తును కాపాడాలి,” అని అన్నారు.
చంద్రబాబు మంచి చేయకపోగా, చెడు చేస్తున్నారని విమర్శించిన ఆయన, విద్యార్థులు దీనిపై ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందన్నారు. “మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న ర్యాలీలు నిర్వహిస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై డిసెంబర్లో ఆందోళనలు చేపడతాం. అంతవరకు చంద్రబాబుకు సమయం ఇస్తున్నాం,” అని జగన్ చెప్పారు.
Also Read
- Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
అంతేకాకుండా.. “మా వైసీపీ ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసింది. విద్యా దీవెన కింద రూ.12,609 కోట్లు ఇచ్చాం. వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికి రూ.20 వేల చొప్పున అందించాం. పేద కుటుంబాలు అప్పుల పాలు కాకుండా చూశాం,” అని గుర్తుచేశారు. “పేదలకు చదువు భారం కాకూడదు. కానీ ఈ ప్రభుత్వం అన్నింటినీ ధ్వంసం చేస్తోంది. పిల్లలు చదవకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు పనిచేస్తున్నారు. రూ.4,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, రూ.2,200 కోట్ల వసతి దీవెన పెండింగ్‌లో ఉంచారు. మా హయాంలో ప్రభుత్వ రంగంలోనే 6.3 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.2 లక్షల మందికి ఉపాధి కల్పించాం,” అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
AP Update : ఏపీ సర్కార్ సంచలనం.. గ్రామ సచివాలయాల పేరు మార్పు
తాజావార్తలు
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!