Tomato Prices: టమాటా ధరలు కన్నీరు పెట్టిస్తోంది. మూడు నెలల క్రితం సెంచరీ కొట్టిన టమాటా ఇప్పుడు కిలో 5 రూపాయలు కూడా పలకడం లేదు. ఓవైపు తోటల్లో అధిక దిగుబడి రాగా కొందామంటే కోత ఖర్చులు కూడా గిట్టుబాటు కానీ పరిస్థితి. దీంతో పంటను ఏం చేయాలో తెలియక టమాటా రైతులు ఆందోళన చెందుతున్నారు. మదనపల్లి టమాటా మార్కెట్లో పరిస్థితిపై స్పెషల్ స్టోరీ.
Read Also: Woman’s lemon crushing ritual car accident : అరే.. నిమ్మకాయలు తొక్కించబోతే…ఏంత పనైపోయింది..
అయితే, దేశంలోనే అతి పెద్ద టమాటా మార్కెట్లలో ఒకటైన మదనపల్లి మార్కెట్లో ప్రస్తుతం టమాటా పేరుకుపోతుంది. ఆరుగాలం పండించిన పంటను మార్కెట్ కు తేస్తున్న రైతు అక్కడి ధరల పతనాన్ని చూసి షాక్ అవుతున్నాడు. కిలో టమాటా కనీసం 5 రూపాయలు కూడా పలక్కపోవడంతో పంటను అమ్మలేక వెనక్కి తెచ్చుకోలేక రోడ్లపై పారబోస్తున్నాడు. మదనపల్లి డివిజన్ లో 1400 హెక్టార్లలో రైతులు టమోటా సాగు చేస్తున్నారు. ఇక్కడి మార్కెట్ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర మార్కెట్లకు టమోటా ఎగుమతి అవుతోంది. నిత్యం 300 నుంచి 1000 టన్నల వరకు టమోటా ఎగుమతి చేస్తారు. అయితే, బయట ప్రాంతాల్లో కూడా టమోటా సాగవుతూ ఉండడంతో మదనపల్లి మార్కెట్లో ధరలు పడిపోతున్నాయి. రెండు వారాలుగా నాణ్యమైన టమాటా కిలో 10 రూపాయలు పలుకుతుండగా నాణ్యత లేని రెండో రకం టమాటా కిలోకు 5 రూపాయలు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఉన్న పంటని ఏం చేసుకోవాలో తెలియక అయోమయంలో పడుతున్నారు రైతులు.
Read Also: Nara Lokesh: సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభకు మంత్రి నారా లోకేష్ దూరం.. ఎందుకో తెలుసా..?
ఇక, ఉత్పత్తి ఎక్కువగా ఉండటం వల్ల టమాటాలు అన్ని ఏరియాల్లో భారీగా వస్తున్నాయి.. కాబట్టి ఇప్పుడు మార్కెట్లో ధర ఒక్కసారిగా తగ్గిపోయింది. అయితే, బయట చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో టమాటా పంట బాగా పండింది. ప్రస్తుతానికి ఫస్ట్ క్వాలిటీ వచ్చి రూ. 400 నుంచి 500 వెళ్తున్నాయి. సెకండ్ క్వాలిటీ వచ్చి రూ. 300 350 లీస్ట్ క్వాలిటీ వచ్చి రూ.100, 150 వరకు పలుకుతుంది. అలాగే, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో సైతం టమోటా సాగు ఎక్కువ కావడంతో అక్కడి నుంచి ఆర్డర్లు రావడం మొత్తం తగ్గిపోయింది.
Read Also: Tribal Struggles: స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు.. చీకట్లోనే గిరిజనుల బతుకులు..!
మరోవైపు, మార్కెట్ కు టమాటా విక్రయానికి తీసుకొచ్చిన రైతులకు కనీసం ట్రాన్స్ పోర్టు, కూలీ ఖర్చులకు కాదు కదా తిరుగు ప్రయాణం చార్జీలకు కూడా రావడం లేదు అని రైతులు వాపోతున్నారు. కష్టపడి పండించిన టమాటా పంటను ఎవరూ కొనడానికి రాకపోవడంతో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఎంతో వ్యయ ప్రయాసలు పడి మార్కెట్ కు తీసుకొస్తున్న టమాటాను చివరకు ఏం చేయాలో తెలియక అక్కడే పారపోసి ఉసూరు మంటూ రైతులు వెనుదురుగుతున్నారు. కూలీ, రవాణ ఖర్చులు దండగనంటూ చాలా మంది రైతులు పొలాల్లోనే పంటను వదిలేస్తున్న పరిస్థితులు పలు చోట్లు కనిపిస్తున్నాయి.