సీఎం జగన్‌కు కొత్త పేరు పెట్టిన నారా లోకేష్.. ఇక నుంచి ఆయన…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, సీఎం వైఎస్ జగన్‌కు కొత్త పేరు పెట్టారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ రెడ్డి పేరు ఇక నుంచి జాంబీ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు.. సీఎం కుర్చీలో ఉన్నవారికి సంక్షేమం, అభివృద్ధి చేస్తే ఆనందం వస్తుంది.. కానీ, జాంబీ రెడ్డి.. టిడిపి నేతలు, కార్యకర్తల అరెస్టులతో ఆనందిస్తున్నారని మండిపడ్డారు.. మాపార్టీ వారిపై కేసులు, అరెస్టులు టీవీల్లో చూసి తాడేపల్లి ఇంట్లో జాంబీ రెడ్డి తొడ కొట్టుకుంటారనంటూ సెటైర్లు వేసిన లోకేష్.. అనపర్తిలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి యాక్టర్ గా మారారని.. అనపర్తిలో స్థానిక ఎమ్మెల్యే అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టారనే రామకృష్ణారెడ్డిని అక్రమ అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం, రామవరం గ్రామంలో కేసులు, అరెస్టులకు గురైన టీడీపీ నాయకుడు..మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన నారా లోకేష్… ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.. చట్టానికి వ్యతిరేకంగా మాపై కేసులు పెడుతున్న అందరి పేర్లు సిద్ధంగా ఉన్నాయి, వారు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.. నా పై కేసులు పెట్టండి బరిస్తా… నన్ను అరెస్ట్ చేయండి బాధపడను.. మా పార్టీ కార్యకర్తల జోలికి వస్తే వడ్డీతో సహా ఇచ్చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు నారా లోకేష్.
Also Read
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై పవన్ కల్యాణ్.. రెండో రోజు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు
- Deputy CM Pawan Kalyan: గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై సమీక్ష.. పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి
- MLC AnanthaBabu: ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. బెయిల్ రద్దు చేసిన కోర్టు
- CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!