Site icon NTV Telugu

YS Jagan: ఏపీఎండీసీ ద్వారా బాండ్లు జారీ.. రాష్ట్ర భవిష్యత్త్ను నాశనం చేసేలా ప్రభుత్వ నిర్ణయం..

Jagan

Jagan

YS Jagan: ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను చంద్రబాబు ప్రభుత్వం తాకట్టు పెట్టిందన్నారు. హైకోర్టులో కేసు నడుస్తున్నా లెక్క చేయకుండా ఏపీఎండీసీ ద్వారా రెండోసారి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ బాండ్లు జారీ చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎండీసీ ద్వారా మళ్లీ రుణ సమీకరణకు ప్రయత్నిస్తున్నారు.. రాష్ట్ర ఖజానా నుంచి ప్రైవేట్ వ్యక్తులు నిధులు డ్రా చేసుకునేలా ఆదేశాలు ఇవ్వటం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. శాసనసభ ఆమోదం లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి నిధుల డ్రా చేయడం సరికాదు అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం యధేచ్చగా ఆర్టికల్స్ 203, 204 ఉల్లంఘించింది అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.

Read Also: Operation Midnight Hammer: ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా విధ్వంసం.. శాటిలైట్‌ చిత్రాలు వెలుగులోకి

అయితే, ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టటం చట్ట ఉల్లంఘనే అని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రూ. 1.91 లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదను ప్రైవేటు వ్యక్తులకు తాకట్టు పెట్టారు అని ఆరోపించారు. ఇది రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేయటమే.. ఈ వ్యవహారంపై హైకోర్టులో కేసు నడుస్తోంది.. ఆ కేసులో ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు కూడా ఇచ్చింది.. ఆ కేసు నడుస్తుండగానే ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ బాండ్లు జారీ చేయటం సరికాదు అని తెలిపారు. ఇది కచ్చితంగా భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమే కాక రాష్ట్ర భవిష్యత్తును కూడా ప్రభుత్వం నాశనం చేస్తోంది అని జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Exit mobile version