మందుబాబులు మందేసి చిందేశారు. ప్రశాంతంగా, స్వచ్ఛంగా వుండే ప్రాంతాన్ని గబ్బుగబ్బు చేశారు. అక్కడ ఎక్కడ చూసినా మందుబాటిళ్ళు, చెత్తా చెదారం. ఎవరూ నోరుమెదపలేదు. మాకెందుకులే అనుకున్నారు. కానీ ఆ యువత మాత్రం సామాజిక బాధ్యత నెరవేర్చారు. ఎవరో వస్తారని ఆ మందు బాటిళ్ళు, చెత్త తొలగిస్తారని ఊరుకోలేదు. ప్లే గ్రౌండ్ ను ఓపెన్ బార్ గా మార్చేసిన మందుబాబులకు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మందుబాబుల కళ్ళు తెరిపించే ప్రయత్నం చేశారు.
Viral News : కడుపునొప్పని ఆసుపత్రికి పోతే.. షాకింగ్ విషయం తెలిసింది..
ప్లే గ్రౌండ్ శుభ్రం చేస్తున్న యువత
ఫుల్ గా ఫుల్లేశాక విచక్షణ కోల్పోతారు మందుబాబులు. నిషా తలకెక్కిన తర్వాత బాటిళ్లను పగలగొడతారు. అయితే అక్కడ యువత మాత్రం మా జీవితాలతో ఆడుకోవద్దు…..మీకో దణ్ణం అంటూ వారిచ్చిన మెసేజ్ ఆకర్షిస్తోంది. ఇందు కోసం పగిలిన బాటిళ్లు ను కుప్పగా పోసి అభ్యర్ధించడం వైరల్ గా మారింది. అనకాపల్లి జిల్లా చోడవరం నుంచి ఖండేపల్లి గ్రామం వెళ్ళే రహదారి పక్కన ప్లే గ్రౌండ్ ఉంది. వాకర్స్ తో పాటు ఆర్మీ,పోలీస్ సెలక్షన్స్ కోసం ఇక్కడ యువతీ యువకులు కసరత్తులు చేస్తుంటారు. చీకటి పడేవరకూ అంతా బాగానే వుంటుంది. సాయంత్రం అయ్యే సరికి మందుబాబులు ఇక్కడ దుకాణం తెరుస్తున్నారు. కడుపు నిండా తాగి బాటిళ్లను ఎక్కడికక్కడ విసిరేసిపోతున్నారు. కొంత కాలంగా ఈ ఆగడాలు శృతి మించడంతో స్థానిక యువకులు వెరైటీ నిరసనకు దిగారు. బాటిళ్లను సేకరించి ఒక కుప్పగా పోసి నిరసన తెలిపారు. మందుబాబుల తీరు మారాలని వారు కోరుకున్నారు. మరి మందుబాబులు మారతారా? మళ్ళీ ఆ ప్లే గ్రౌండ్ ను పాత తీరుగా మార్చేస్తారా? ఏమో ఏనుగు ఎగరావచ్చు అన్నట్టుగా… ఆ మందుబాబులు మారతారేమో చూద్దాం.
India Corona: ఆగని కరోనా ఉద్ధృతి.. తాజాగా 18,257 కేసులు