హత్యలు,ఆత్మహత్యలు, దాడులు.. సమాజంలో ఒకరిపై ఒకరు అక్కసు, అయిష్టం, కోపం ఎంతటి వారినైనా హత్య చేసేందుకు తెర లేపుతోంది. నవ సమాజంలో మానవత్వం నశిస్తోంది. మరీ క్రూరమృగాల్లా వ్యవహరిస్తున్నారు. మృగాలైనా జంతువులను చంపడానికి, వాటిపై దాడి చేయాడానికి కాస్తైన ఆలోచిస్తాయేమో గానీ.. కానీ, మనిషి మాత్రం ఏమాత్రం ఆలోచనలేకుండా మరీ మృగం కంటే హీనంగా బతుకుతున్నాడు. ఇలాంటి ఘటనలే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని.. విజయవాడ, గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్నాయి.
విజయవాడ గురునానక్ కాలనీలో ఫుట్‌బాల్ ప్లేయర్‌ను దారుణంగా హత్య చేశారు. స్నేహితుల గదిలో ఉన్న అతడిని పరిచయం ఉన్న వ్యక్తులే కత్తులతో గొంతులో పొడిచి చంపారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. జక్కంపూడికి చెందిన ఆకాష్(22) ఫుట్‌బాల్ ఆటగాడు. లయోలా కళాశాలలో చదువుతున్న అతని స్నేహితులు గురునానక్ కాలనీలోని ఉండవల్లి కన్స్ట్రక్షన్ వద్ద ఉన్న సర్వీసు అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారు.
మంగళవారం నగరంలో టోనీ అనే రౌడీషీటర్ అంత్యక్రియలకు ఆకాశ్‌తోపాటు మరికొందరు వెళ్లారు. అక్కడ మద్యం మత్తులో ఆకాశ్‌కు వివాదం జరిగింది. అనంతరం గురునానక్ కాలనీలోని స్నేహితుల అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు. అంత్యక్రియల వద్ద జరిగిన వివాదాన్ని మనసులో పెట్టుకున్న ప్రత్యర్థులు ఆకాశ్ గొంతులో పొడిచారని పోలీసులు తెలిపారు. అతడ్ని సమీపాన ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసును పటమట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే.. ప్రేమ వ్యవహారంలో తల్లి, కుమార్తెపై యువకుడు దాడికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా కృష్ణనగర్‌లో జరిగింది. తల్లి, కుమార్తె గొంతుపై బ్లేడ్‌తో దాడిచేయడంతో… ఇద్దరికీ స్వల్పగాయాలయ్యాయి. వారిని స్థానికులు జీజీహెచ్ కు తరలించారు. కృష్ణనగర్ పీఎఫ్ కార్యాలయం వద్దనున్న అపార్టుమెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడి అనంతరం అపార్టుమెంట్ రెండో అంతస్థు నుంచి దూకేందుకు యువకుడు యత్నించగా.. స్థానికులు పట్టుకుని పోలీసులక అప్పగించారు. గాయాలపాలైన యువకుడిని కూడా జీజీహెచ్‌కు తరలించారు.
వరుస దాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏక్షణంలో ఏం జరుగుతోందో అంటూ ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వాటిని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.