YCP Social Media: సోషల్ మీడియాపై వైసీపీ స్పెషల్ ఫోకస్.. నియోజకవర్గాల వారీగా టీమ్‌లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పార్టీ సోషల్ మీడియా వింగ్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించారు.. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సామాజికి మాధ్యమాల సామూహాన్ని పటిష్టం చేశారు.. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా బాధ్యతల్ని సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే.. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా బాధ్యతల్ని ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తూ రాగా.. ఈ మధ్యే.. సజ్జల భార్గవ్‌కు సోషల్ మీడియా బాధ్యతలు కట్టబెట్టారు.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిజిటల్ కార్పొరేషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో ప్రచార బాధ్యతల్ని పర్యవేక్షించడానికి ఐ అండ్ పిఆర్‌కు అనుబంధంగా మొదట్లో డిజిటల్ డైరెక్టర్‌ను నియమించారు. ఆ తర్వాత దానిని ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో విపక్షాల నుంచి ఎదురవుతోన్న సవాళ్లకు గట్టిగా కౌంటర్ ఇచ్చే విధంగా.. ఓ టీమ్‌ను తయారు చేసుకున్నారు..
Read Also: Central Funds: ఏపీ, యూపీ సహా ఈ రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్..
Also Read
- Amaravati Seed Access Road: అమరావతికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
- AP High Court: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం.. మూడేళ్లయినా దర్యాప్తు పూర్తి చేయరా..?
- Amaravati Projects: అమరావతిలో నేడు కీలక ప్రాజెక్టుల ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
- YS Jagan Kurnool Tour: కర్నూలులో నేడు జగన్ పర్యటన.. పోలీసుల అనుమతి.. షరతులు ఇవే..!
అయితే, ఇది కేవలం రాష్ట్రస్థాయిలోనే కాకుండా.. జిల్లాస్థాయిలో.. చివరకు నియోజకవర్గాల స్థాయిలోనే విస్తరించేందుకు ప్లాన్ చేసిన వైసీపీ.. అందులో భాగంగా ఇప్పుడు మరో ముందడుగు వేసింది.. నియోజకవర్గాల వారీగా సోషల్ మీడియా కన్వీనర్లు, కో-కన్వీనర్లను నియమించింది.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు నుంచి ఆరుగురిని సోషల్ మీడియా వింగ్ కింద నియమించింది.. అంటే, కేవలం రాష్ట్రస్థాయిలో సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తే సరిపోదని.. నియోజవర్గాల వారీగా టీమ్‌లు ఉంటే.. అక్కడ పార్టీ, ప్రభుత్వ ప్రచారంతో పాటు.. విపక్షాలు చేసే ఆరోపణలు, విమర్శలకు వెంటనే కౌంటర్ ఇవ్వాలనే ప్లాన్‌లో భాగంగా.. వైసీపీ నియోజకవర్గాల వారీగా టీమ్‌లను నియమించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంది.. బీజేపీ కూడా పరవాలేదు.. ఇప్పుడు అధికార వైసీపీ.. వారందరికీ కౌంటర్ ఇచ్చేలా స్పెషల్ వింగ్‌తో రెడీ అవుతోంది.
తాజావార్తలు
-
Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
-
Amaravati Seed Access Road: అమరావతికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
-
Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
-
Annapurna Studios: ఏఎన్నార్ దార్శనికత.. నాగార్జున ఆధునికత.. అన్నపూర్ణ స్టూడియోస్‌కు 51 ఏళ్లు
-
South Stars Mumbai Homes : సౌత్ స్టార్స్‌కు సెకండ్ హోమ్‌గా ముంబై.. కోట్లాది రూపాయల విలువైన హౌసెస్ కొనుగోలు
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!