Site icon NTV Telugu

Ambati Rambabu: ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు.. ప్రాణాలు పోయేవారు పోరాటం చేస్తా..

Ambati

Ambati

Ambati Rambabu: నా ఇంటిపై సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన దాడి అర్ధరాత్రి 12 గంటల వరకు అంటే దాదాపుగా 7 గంటల పాటు జరిగిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. బొత్స సత్యనారాయణ, రాష్ట్ర డీజీపీ, డీఐజీ, ఎస్పీలకు అనేకసార్లు ఫోన్ చేసిన ఎవరు ఫోన్ ఎత్తలేదు.. ఒక్కరు కాకపోయినా ఒక్కరు కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్సీల ఫోన్లు ఎత్తలేదు.. అసలు క్రిమినల్స్ దాడికి వచ్చిన వాళ్ళు కాదు.. డీజీపీ ఒక క్రిమినల్, ఎస్పీ క్రిమినల్, ఐజీ, చంద్రబాబు, లోకేష్ క్రిమినల్స్.. రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు ఫోన్లు ఎత్తలేదు అంటే కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందో అర్థ చెసుకొవచ్చని అంబటి పేర్కొన్నారు.

Read Also: Michael Vaughan: “పాకిస్థాన్ క్రికెట్‌లో పాలిటిక్స్”.. బాబర్ ఫామ్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్

అయితే, మా ఇంటిపై దాడి జరిగే సమయంలో ముందు, గంజాయి సరఫరా చేశారని అంటి రాంబాబు ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది.. మాజీ మంత్రి ఇంటిపై ఏకధాటిగా 7 గంటలకు పైగా దాడి జరిగితే పోలీసులు నిద్రపోయారా.. మా ఇంటి దగ్గరకు వచ్చిన ఎస్పీ తిరిగి వెనక్కి వెళ్ళాడు.. ఇంకా మాకు పనులు ఉండవా అంటూ ఎస్పి మాట్లాడటం బాధాకరం.. చంద్రబాబుకి టచ్ లో ఉండే పనిలో ఉన్నారా ఎస్పీ.. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు.. ప్రాణాలు పోయేంత వరకు పోరాటం చేస్తాని తెలిపారు. దాడులు చేసే వారికి పోలీసుల రక్షణగా ఉంటే ఏం చేయాలని క్వశ్చన్ చేశారు. కూటమి పాలనలో వ్యవస్థలు ఏ విధంగా తయారవుతున్నాయో రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరారు. అన్నిటికీ సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందని మాజీ మంత్రి రాంబాబు వెల్లడించారు.

Exit mobile version