Andhra Pradesh: కొత్త జిల్లాల్లో ఉద్యోగుల విభజన అప్పుడే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా నడుస్తోందని ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయకుమార్ వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై మార్చి 3 దాకా అభ్యంతరాలు స్వీకరణ ఉంటుందన్నారు. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే కొత్త జిల్లాలలో ఉద్యోగుల విభజన ఇప్పుడు ఉండదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాతే ఉద్యోగుల విభజన ఉంటుందన్నారు. ఆర్డర్ టు వర్క్ ప్రాతిపదికన మాత్రమే కొత్త జిల్లాల్లో ఉద్యోగుల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు.
కాగా కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రాయలసీమ జిల్లాల నుంచి 1600 అభ్యంతరాలు అందాయని ఏపీ ప్లానింగ్ శాఖ కార్యదర్శి విజయకుమార్ తెలిపారు. అభ్యంతరాలు పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజిస్తూ ప్రభుత్వంలో గతంలో నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై మార్చి 15 నుంచి 17 మధ్య తుది నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత మార్చి 18న జిల్లాల్లో కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేస్తారు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. అదే రోజు నుంచి కొత్త జిల్లా కేంద్రాలుగా ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలు పనిచేయనున్నారు. పాత జిల్లాలకు కూడా వీరే ఇంఛార్జ్ కలెక్టర్లుగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
తాజావార్తలు
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్‌గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్‌హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!